అన్వేషించండి

Amaravati News: త్వరలోనే అమరావతిలో బ్యాడ్మింటన్ క్లబ్ - ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూలో పుల్లెల గోపీచంద్ 

Pullela Gopichand: త్వరలోనే అమరావతిలో బ్యాడ్మింటన్ క్లబ్ పెట్టబోతున్నట్టు పుల్లెల గోపీచంద్‌ తెలిపారు. ఇప్పటికే సీఎంతో సమావేశమైనట్టు వెల్లడించారు.

Andhra Pradesh News: ఆంధ్రుల నయా రాజధాని అమరావతిలో బ్యాడ్మింటన్ క్లబ్ పెడుతున్నట్టు ప్రఖ్యాత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ ప్రస్తుత కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఏబీపీ దేశంతో  ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన ఆయన ఈ సర్ప్రైజ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశానని దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తానని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్ అనేది కేవలం ధనవంతుల క్రీడ అనే అపోహ చాలా మందిలో ఉందని అలా కాకుండా ఈ స్పోర్ట్‌ని అందరికీ దగ్గర చేసేందుకు అమరావతి బ్యాడ్మింటన్ కోచింగ్ క్లబ్ ఉపయోగపడుతుందని పుల్లెల గోపీచంద్ తెలిపారు.

2014-19 టైంలోనే చంద్రబాబుకు మాట ఇచ్చిన గోపీచంద్ 
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు 2016లో తొలిసారిగా ఒలింపిక్ మెడల్ గెలిచినప్పుడు అప్పటి ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఆమెను,కోచ్ గోపీచంద్‌ను ఘనంగా సన్మానించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "అమరావతిలో స్థలం ఇస్తాం ఏపీలో కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ " పెట్టాలని గోపిచంద్‌కు సూచించారు. గోపీచంద్ కూడా దానికి ఓకే అన్నారు. అయితే 2019లో టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోవడం తో ఆ ప్రపోజల్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో గోపీచంద్ ఆయన్ను కలిశానని తెలిపారు. ప్రస్తుతం అమరావతి పనులు వేగవంతం కావడంతో తన కోచింగ్ క్లబ్‌ను కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం కోసం గోపీచంద్ రెడీ అయ్యారు. పూర్తి వివరాలు త్వరలోనే గోపీచంద్ అన్నారు.

సింధు, సైనాకు వచ్చిన పేరు పురుషులకు అందుకే రాలేదు : గోపీచంద్ 
బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్,  పీవీ సింధుకు వచ్చిన పేరు, మీడియా గ్లామర్ పురుషలకి రాకపోవడానికి కారణం సాధించిన మెడల్సే అన్నారు గోపీచంద్. క్రీడల్లో సాధించిన మెడల్స్‌ను బట్టి మీడియా ఇమేజ్ పెరుగుతుందన్న్నారు. ప్రస్తుతం కిదాంబి శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఒక్క ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆటోమేటిగ్గా వాళ్ళకీ ఇమేజ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతే తప్ప బాడ్మింటన్‌లో మహిళలకే ఎక్కువ పేరు వస్తుందనేది వట్టి అపోహ మాత్రమే అని పుల్లెల గోపీచంద్ ఏబీపీ దేశంతో ఎక్స్ క్లూజివ్‌గా తెలిపారు..

Also Read: కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!

టాప్ హెడ్ లైన్స్

AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget