News
News
వీడియోలు ఆటలు
X

IPL 2021: ఎరుపు రంగు నుంచి నీలి రంగు జెర్సీకి మారిన ఆర్‌సీబీ.. ఎందుకో తెలుసా?

ఐపీఎల్ రెండో దశకు రాయల్‌ ఛాలెంజర్స్‌ ప్రత్యామ్నాయ జెర్సీ, కిట్‌ను ఆవిష్కరించింది. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో కిట్‌ వివరాలను పంచుకొంది.

FOLLOW US: 
Share:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సై అంటోంది. ప్రత్యామ్నాయ జెర్సీ, కిట్‌ను ఆవిష్కరించింది.  సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో కిట్‌ వివరాలను పంచుకొంది. ఏటా ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ప్రత్యామ్నాయ కిట్‌ ఈ సారి నీలి రంగుకు మారడమే అసలైన ట్విస్టు!

సాధారణంగా ఆర్‌సీబీ ఎరుపు, నలుపు, బంగారు వర్ణం కిట్‌ను ఉపయోగిస్తుంది. సీజన్‌లో ఒక మ్యాచులో మాత్రం ఆకుపచ్చ జెర్సీ కిట్‌ను ఉపయోగిస్తుంది. పర్యావరణం, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా చేస్తుంది.  ఈ సారి మాత్రం పచ్చరంగు బదులు నీలం రంగు కిట్‌ను రూపొందించింది. కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎంతగా సంక్షోభం వచ్చిందో అందరికీ తెలిసిందే.  ఆ మహమ్మారి నుంచి రక్షించేందుకు వైద్యులు సహా ఎంతో మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు రాత్రి పగలూ పనిచేశారు. వారిని గౌరవించేందుకే ఆర్‌సీబీ ఈసారి నీలి రంగు కిట్‌ను ఎంపిక చేసుకుంది.

Also Read: DC On IPL 2021: ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టులో కీల‌క మార్పు.. క్రిస్ వోక్స్ స్థానంలో మ‌రో ఆటగాడు.. ఎవ‌రంటే?

సెప్టెంబర్‌ 20న ఆర్‌సీబీ ఐపీఎల్‌ రెండో దశలో మొదటి మ్యాచ్‌ ఆడనుంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచుకు ఆర్‌సీబీ నీలిరంగు జెర్సీ ధరించనుంది. ఐపీఎల్‌ మొదటి దశ సమయంలోనే తొలి వరుస యోధులను ప్రత్యేకంగా గౌరవిస్తామని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బెంగళూరు నగరం సహా దేశ వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం తమ ఫ్రాంచైచీ తరపు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించడం గమనార్హం.

Also Read: Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..

కరోనా మహమ్మారిపై పోరాటం కోసం 'గివ్ ఇండియా ఫౌండేషన్‌'తో ఆర్‌సీబీ చేతులు కలిపింది.  కొవిడ్ ఆరంభం నుంచి బెంగళూరు నగర వ్యాప్తంగా ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్లను ఇస్తోంది.  ఇప్పటికే ఆర్‌సీబీ మాతృసంస్థ డియాగో ఇండియా 3 లక్షల లీటర్ల సానిటైజర్లను పంచింది. వైద్య రంగం కోసం రూ.75 కోట్లను కేటాయించడం గమనార్హం.

Also Read: Hiring sentiment improves: పండగల వేళ ఉద్యోగ నియామకాల హేళ..! పెరగనున్న జీతాలు..!

Published at : 14 Sep 2021 03:18 PM (IST) Tags: RCB IPL 2021 IPL 2021 News KKR RCB vs KKR COVID-19 Frontline Warriors RCB Team Jersey RCB Team Blue Jersey

సంబంధిత కథనాలు

WTC Final 2023: ఓవల్‌ పిచ్‌పై అలాంటి బౌలింగా!! టీమ్‌ఇండియా కష్టాలకు రీజన్‌ ఇదే!

WTC Final 2023: ఓవల్‌ పిచ్‌పై అలాంటి బౌలింగా!! టీమ్‌ఇండియా కష్టాలకు రీజన్‌ ఇదే!

WTC Final 2023: ఆసీస్‌కు ఫాలోఆన్‌ ఆడించే దమ్ము లేదు! 2001 భయం పోలేదన్న సన్నీ!

WTC Final 2023: ఆసీస్‌కు ఫాలోఆన్‌ ఆడించే దమ్ము లేదు! 2001 భయం పోలేదన్న సన్నీ!

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND VS AUS: అజింక్య అద్బుతమే చేయాలి - టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పీకల్లోతు కష్టాల్లో భారత్!

IND VS AUS: అజింక్య అద్బుతమే చేయాలి - టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పీకల్లోతు కష్టాల్లో భారత్!

IND VS AUS: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాకు కష్టాలు - 30 పరుగులకే ఓపెనర్లు అవుట్!

IND VS AUS: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాకు కష్టాలు - 30 పరుగులకే ఓపెనర్లు అవుట్!

టాప్ స్టోరీస్

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్