Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడా? పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్సీ బాధ్యతలు ఇకపై రోహిత్ శర్మకే అప్పగించనున్నారా?
కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల ఫార్మట్ నుంచి ఇక తప్పుకోనున్నట్టు తెలుస్తోంది. టీ20 వరల్ట్ కప్ తర్వాత కెప్టెన్సీ మార్పు అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. యూఏఈలో జరగనున్న టీ 20 తర్వాత ఈ మార్పు ఉంటుందట. ఇప్పటికే ఈ విషయంపై జులైలో జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సర్వసభ్య సమావేశం సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ.. ఆ క్రమంలోనే టీమ్ సెలెక్షన్‌ను కూడా పకడ్బందీగా ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పించి మరీ మెంటార్‌గా నియమించింది.
టెస్టులకు కోహ్లీ.. వన్డేలకు రోహిత్
టీ 20 ప్రపంచ కప్ తర్వాత ఇద్దరు కెప్టెన్సీల విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలని సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై బోర్డు సమావేశాల్లో సమాలోచనలు జరిగాయట. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ రానుంది.
మళ్లీ తెరపైకి చర్చ
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథిగా నియమించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో సారథిగా ఐదు టైటిళ్లు గెలిపించడం.. మరోవైపు కోహ్లీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవకపోవడంతో ఈ డిమాండ్ ఎక్కువైంది. పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కోహ్లీ కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో గెలిపించకపోవడంతో కూడా ఈ వాదన తెరపైకి వచ్చింది. కోహ్లీ సారథ్యం టీమిండియా ఓడినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది.
కీలక టోర్నీలలో విఫలం
కీలక ఐసీసీ ఈవెంట్లలో మాత్రం కోహ్లీ విఫలమవుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ వరుసగా మూడు టోర్నీల్లో కోహ్లీకి చుక్కెదురైంది. ఈ మూడు టోర్నీల్లో కోహ్లీ కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి.
స్వయంగా తప్పుకుంటాడనే...
టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడని విశ్లేషకులు అంటున్నారు. కొంత కాలంగా కోహ్లీ కూడా వ్యక్తిగతంగా రాణించడం లేదు. ఈ క్రమంలో తన బ్యాటింగ్‌పై దృష్టిసారించేందుకు.. ఎక్కువ కాలం ఆడేందుకు తానే సారథ్య బాధ్యతలు వదిలేస్తాడంటున్నారు.