US Open 2021: తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టిన మెద్వెదెవ్.. ఆ రికార్డుకు దగ్గరలో ఆగిపోయిన ప్రపంచ నంబర్ వన్ జకోవిచ్
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అద్భుతం చేశాడు. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు.
ఫైనల్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. రష్యా ప్లేయర్ మెద్వెదేవ్ చేతిలో ఓడిపోయాడు. ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అందుకున్న ఆటగాడి రికార్డుకు కొద్ది దూరంలోనే జకోవిచ్ ఆగిపోయాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కేరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జకోవిచ్‌కు షాక్ ఇచ్చాడు మెద్వెదెవ్. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో 34 ఏళ్ల జకోవిచ్‌ను ఓడించాడు.
It was @DaniilMedwed's moment to shine at the #USOpen
— US Open Tennis (@usopen) September 12, 2021
Highlights from the men's singles final 👇 pic.twitter.com/hfP58Ilnio
తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్‌దే పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు. జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మెద్వెదెవ్ 6-4 తేడాతో రెండో సెట్ లో విజయం సాధించాడు. మూడో సెట్‌లో జకోవిచ్ మొదట అలా అలా... ప్లే చేసినా.. తర్వాత పుంజుకున్నాడు. అయినా మెద్వెదెవ్ విజయం సాధించాడు. ఈ సెట్‌లో మెద్వెదెవ్ 6-4 తేడాతో గెలిచాడు. డానిల్ మెద్వెదెవ్ మూడో సెట్‌ను గెలిచాడు. 2019లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి ఓటమి పాలయ్యాడు మెద్వెదెవ్. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఒడిపోయి టైటిల్ గెలిచిన ఆటగాడిగా మెద్వెదెవ్ నిలిచాడు.
Novak Djokovic was going for the Calendar Grand Slam, but @DaniilMedwed had other plans...
— US Open Tennis (@usopen) September 13, 2021
Full recap of the Russian's 6-4, 6-4, 6-4 victory 👇
దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్ ఇంకొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే జకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, నాదల్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. చరిత్ర సృష్టిద్దామనుకుంటే.. నిరాశే ఎదురైంది.