Sumit Antil wins Gold: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం... జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్‌కి బంగారు పతకం
పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు రెండు పసిడి పతకాలు వచ్చాయి.
పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు రెండు పసిడి పతకాలు వచ్చాయి. ఈ రోజు ఉదయం మహిళల ఆర్ - 2 పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో అవని లేఖర పసిడి పతకం ముద్దాడింది. అలాగే జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించాడు.
Take a look at Sumit's attempts in the Javelin Throw F64 Final event
— SAI Media (@Media_SAI) August 30, 2021
1st - 66.95m (New WR)
2nd - 68.08m (New WR)
3rd - 65.27m
4th - 66.27m
5th - 68.55m (New WR)#Praise4Para#Cheer4India
*WR- World Record
పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో సుమిత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో అతడు మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలో 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడంతో మరోసారి తన రికార్డునే తానే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
#SumitAntil is the Champion, World Record Holder, #Tokyo2020 #Paralympics 🥇 #Gold Medallist #Javelin @ParaAthletics
— Paralympic India 🇮🇳 #Cheer4India 🏅 #Praise4Para (@ParalympicIndia) August 30, 2021
Cheer4India #Praise4Para @narendramodi @ianuragthakur @IndiaSports @Media_SAI @ddsportschannel @TheLICForever @VedantaLimited @neerajkjha @EurosportIN pic.twitter.com/jWoM36Bj0l
మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్ బురియన్ 66.29 మీటర్లతో రజతం సాధించగా, శ్రీలంక అథ్లెట్ దులాన్ కొడితువక్కు 65.61 మీటర్లతో కాంస్యం కైవసం చేసుకున్నాడు. భారత్ ఇవాళ మొత్తం ఐదు పతకాలు సాధించగా.. అందులో రెండు స్వర్ణ పతకాలు కావడం విశేషం.
The World Record has been broken !
— Anurag Thakur (@ianuragthakur) August 30, 2021
India 🇮🇳 has won another GOLD🥇 MEDAL !
Sumit Antil congratulations on a splendid 🥇 at #Tokyo2020 #Paralympics
Incredible throw, Inspirational feat !
• Javelin Throw F64 Final with a throw of 68.55m#Praise4Para #Cheer4India pic.twitter.com/zdDbDnIUxs
స్వర్ణం సాధించిన సుమిత్‌కి దేశవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రికెటర్ కే ఎల్ రాహుల్ తదితరులు సుమిత్‌కి సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు.
You gave it your all to achieve sporting glory for the nation 🇮🇳 and we are so proud of your achievements. Keep shining ⭐@AvaniLekhara, Sumit Antil 🥇@nishad_hj, @DevJhajharia, @YogeshKathuniya 🥈 and @SundarSGurjar 🥉 Well done 👏👏
— K L Rahul (@klrahul11) August 30, 2021