Babar Azam: హనీట్రాప్‌లో ఇరుక్కున్న బాబర్ ఆజమ్ - జట్టులో స్థానానికే ఎసరు!
పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు.
పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. అతను తన తోటి క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకరంగా ఛాటింగ్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఆ అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్స్‌లో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్‌లో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో బాబర్ ఆజమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ‘నువ్వు నాతో ఇలాగే ఛాటింగ్ చేస్తేనే నీ బాయ్ ఫ్రెండ్ పాకిస్థాన్ టీమ్‌లో కొనసాగుతాడు.’ అని బాబర్ ఆజమ్ ఈ అమ్మాయితో అన్నట్లు వీడియోల్లో కనిపించింది. బాబర్ ఆజమ్‌కు సంబంధించిన కొన్ని వాయిస్ మెసేజ్‌లు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.
హమీజా ముఖ్తర్ అనే యువతిని కూడా బాబర్ అజమ్ బ్లాక్‌మెయిల్ చేశాడనే ఆరోపణలు గతంలో వచ్చాయి. బాబర్ ఆజమ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా దగ్గరయ్యాడని, ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని హమీజా ముఖ్తర్ ఆరోపణలు కూడా చేసింది.
ఇప్పుడు మళ్లీ బాబర్ ఆజమ్‌పై అసభ్యకరంగా చాటింగ్ చేశాడని ఆరోపణలు రావడంతో పాటు వాటికి సంబంధించిన వీడియోలు, వాయిస్ మేసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. బాబర్ ఆజమ్‌ను కెప్టెన్సీ నుంచి కూడా తప్పించాలనే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉంది. ఇప్పుడు ఈ హనీట్రాప్ ఆరోపణలతో బయటపడటంతో బాబర్‌పై చర్చలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
బాబర్ అజమ్ హనీట్రాప్ ఆరోపణలపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఉన్నది బాబర్ అజమ్ కాదని తమకు నమ్మకం ఉందని పేర్కొంటున్నారు. ఒకవేళ అది బాబర్ అజమ్ అయినప్పటికీ అది అతని వ్యక్తిగత జీవితం అని, అందులోకి తొంగిచూడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ట్విట్టర్‌లో ‘స్టే స్ట్రాంగ్ బాబర్’, ‘ఐయామ్ విత్ స్కిప్పర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. కాగా చాలా మంది నెటిజన్లు మాత్రం బాబర్ అజమ్ ఇలా దిగజారుతాడని అనుకోలేదని, తోటి క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో అసభ్యంతరకరంగా ఛాటింగ్ చేయడం సిగ్గుచేటని అంటున్నారు.
Karachi Lobby is behind this #BabarAzam pic.twitter.com/m3dlWgUpZW
— Jasim Hussain (@jasimhussainn) January 15, 2023
Babar Azam sexting with gf of another Pakistan cricketer and promising her that her bf won’t be out of team if she keeps sexting with him is just 👎🏿
— Dr Nimo Yadav (@niiravmodi) January 15, 2023
I hope allah is watching all this .
pic.twitter.com/nlKEp55dUB