Arshad Nadeem: ఓ గేదె, ఆల్టో కార్ - జావెలిన్ త్రో విజేతకు పాకిస్తాన్‌లో విచిత్రమైన బహుమతులు
Pak Olympic Gold medalist : పాకస్థాన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌కు విచిత్రమైన బహుమతుల్ని పాకిస్తాన్ ప్రజలు ఇస్తున్నారు. అందులో ఓ గేదె కూడా ఉంది.
Pak Olympic Gold medalist Arshad Nadeem to get a buffalo as gift : అభిమానంతో ఎది ఇచ్చినా సంతోషమే అని.. పాక్ ఒలిపింక్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్షద్ నదీమ్ అర్థం చేసుకుంటున్నారు. వెల్లువలా వచ్చి పడుతున్న బహుమతుల్ని చూసి ఆయన తబ్బిబ్బవుతున్నారు. అయితే కొన్ని బహుమతులు ఆయనను కూడా ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆయనకు ఓ గేదెను బహుమతిగా ఇచ్చాడు ఓ పెద్దాయన. ఆయన ఎవరో కాదు.. అర్షద్ నదీమ్ మామనే. ఇలా ఎందుకు ఇచ్చారంటే.. వాళ్ల ఊళ్లో గెదేను బహుమతిగా ఇవ్వడం అంటే.. ఒలిపింక్ మెడల్ కన్నా పెద్ద గౌరవం అంట. అందుకే తన అల్లుడికి గేదెను తెచ్చి ఇచ్చాడు ఆర్షద్ మామ.
Confirmation: The buffalo which Arshad Nadeem's father-in-law has gifted him is worth 8 Lac PKR. Arshad is really happy with the gift; this is true love. The value of a buffalo in rural economy is immense 🇵🇰❤️❤️❤️#Paris2024 #OlympicGames pic.twitter.com/O5J0pIpYE0
— Farid Khan (@_FaridKhan) August 13, 2024
అంతే కాదు ఓ అమెరికన్ బేస్డ్ పాకిస్తాన్ వ్యాపారవేత్త ఆల్టో కారును ప్రకటించారు. ఆడినో.. బీఎండబ్ల్యూనో ప్రకటించడం గౌరవం కానీ ఆల్టో కారు ప్రకటించడం ఏమిటని ఆ వ్యాపారవేత్తపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్ విజేతను అవమానిస్తున్నారని మండి పడుతున్నారు. అయితే ఇలాంటి విచిత్రమైన బహుమతులతో పాటు పెద్ద ఎత్తున ఇతర బహుమతులు కూడా నదీమ్‌కు వస్తున్నాయి. పాకిస్థాన్ లోని వివిధ ప్రభుత్వాలు కోట్ల రూపాయల బహుమతులు ప్రకటిస్తున్నాయి.
నదీమ్ స్వరాష్ట్రం పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఏకంగా 100 మిలియన్ల పాక్ కరెన్సీ ఇవ్వనున్నారు. ఇది మన రూపాయల్లో మూడు కోట్ల తో సమానం. అలాగే పంజాబ్ గవర్నర్ సర్దార్ సలీం హైదర్ ఖాన్ 2 మిలియన్ పాకిస్థాన్ రూపాయల రివార్డు ప్రకటించారు. ఇక సింధ్ ముఖ్యమంత్రి 50 మిలియన్ల పాకిస్థాన్ రూపాయలు.. వీటితో పాటూ నదీమ్ సూపర్ పెర్ఫామెన్స్ నచ్చి ప్రముఖ పాకిస్థాన్ సింగర్ అలీ జఫర్ 1 మిలియన్ పాక్ కరెన్స ఇవ్వాలని నిర్ణయించారు. క్రికెటర్లు కూడా తమ కానుకలను ప్రకటించారు. దీంతో నదీమ్ ఒక్క సారిగా కోటీశ్వరుడు అవుతున్నారు.
ఒలింపిక్ క్రీడలకు వెళ్లడానికి నదీమ్ చాలా కష్టపడ్డారు. ఆయనకు కొత్త జావెలిన్ కూడా లభించలేదు. పోటీలకు వెళ్లేటప్పుడు ఎవరూ ఫేవరేట్ గా కూడా భావించలేదు. ఫైనల్ కు చేరుకునే సమయంలో కూడా నీరజ్ చోప్రానే మొదటి స్థానంలో ఉన్నారు. కానీ ఫైనల్‌లో మాత్రం.. నదీమ్ గోల్డ్ మెడల్ గెలిచారు. చోప్రా రజతంతో సరి పెట్టుకున్నారు.