అన్వేషించండి

Paris Olympics 2024: ప్రపంచ ఛాంపియన్‌ అయినా భర్తే కదా, సారీ మై లవ్‌ అంటూ భార్యకు క్షమాపణ

Olympic Games Paris 2024: జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పడం గొప్ప విషయం. అది కూడా బహిరంగంగా, పోనీ చెప్పిన వ్యక్తి ఏమన్నా సామాన్యుడా అంటే కాదు అతను ఒక దిగ్గజ అథ్లెట్‌.. ఇంతకీ విషయం ఎంతంటే?

Olympian sorry to wife for losing wedding ring in Seine: అతనో దిగ్గజ్జ అథ్లెట్‌. ప్రపంచ ఛాంపియన్‌ కూడా. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత కూడా. అయితే తాను చేసిన ఓ తప్పునకు తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. ఒలింపిక్స్‌(Olympics)లో హైజంప్‌లో ప్రపంచ ఛాంపియన్‌, ఇటలీకి చెందిన దిగ్గజ అథ్లెట్‌ జియాన్మారో తంబెరీ(Gianmarco Tamberi) తన సతీమణికి క్షమాపణలు చెప్పాడు. "సారీ, మై లవ్" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. మరోసారి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించనంటూ  క్షమాపణలు  చెప్పాడు.
 
ఇంతకీ ఏమైందంటే....
ఒలింపిక్స్‌లో ఈసారి పతకం తప్పక వస్తుందని ఇటలీ భారీగా ఆశలు పెట్టుకున్న ఈవెంట్‌లలో హైజంప్‌ ఒకటి. ఎందుకంటే ఇటలీ తరపున బరిలోకి దిగింది దిగ్గజ అథ్లెట్‌, గత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత జియాన్మార్కో తంబెరీ. ప్రపంచ ఛాంపియన్‌ అయిన అతను బరిలోకి దిగితే పతకం ఖాయమనే ఇటలీ భావిస్తోంది. ఈ దిగ్గజ అథ్లెట్ తన నిర్లక్ష్యం కారణంగా తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో తంబేరీ... ఇటలీ ఆటగాళ్లకు నేతృత్వం వహించాడు. పతాకధారుడిగా ఇటలీ జెండా ఊపుతూ తంబేరీ ముందు నిలబడగా... పడవలో వెనక మిగిలిన అథ్లెట్లు నిలబడ్డారు. సెయిన్‌ నదిలో ఇటలీ అథ్లెట్లు ఉన్న పడవ ముందుకు సాగిపోతుండగానే... ఇటలీ జెండా ఊపుతున్న సమయంలో అతని చేతికి ఉన్న ఉంగరం జారి నీళ్లలో పడిపోయింది. దీంతో తంబేరీ హతాశుడయ్యాడు. ఎందుకంటే అది తంబేరి వివాహ ఉంగరం. దీంతో తన భార్యకు ఇన్‌ స్టా వేదికగా తంబేరీ క్షమాపణలు చెప్పాడు. " సారీ మై లవ్‌" అంటూ భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. "నన్ను క్షమించు" అంటూ తన భార్య చియారా బొంటెంపికి తంబేరీ ఇన్‌ స్టా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. తన బాధను అర్థం చేసుకుని క్షమించాలంటూ నెటిజన్లు తంబేరీ భార్యను కోరుతున్నారు. ప్రపంచ ఛాంపియన్‌ అయినా భార్యకు సారీ చెప్పాల్సిందే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తంబేరీ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఖతార్‌కు చెందిన ముతాజ్ బర్షిమ్‌తో కలిసి ఒలింపిక్ స్వర్ణాన్ని పంచుకున్నాడు. 
 
అందరి కళ్లు బైల్స్‌పైనే
విశ్వ క్రీడల్లో అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ బైల్స్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇవాళ ఆల్‌రౌండ్‌ అర్హత పోటీల్లో బైల్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవనుంది. అర్హత రౌండ్లో ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్, వాల్ట్, బ్యాలెన్స్‌ బీమ్, అన్‌ఈవెన్‌ బార్స్‌లో బైల్స్‌ తలపడనుంది. జిమ్నాస్టిక్‌ చరిత్రలో ఓ సంచలనంగా అద్భుతంగా పేరుగాంచిన బైల్స్ ఈ ఒలింపిక్స్‌లో ఏం చేస్తారన్న దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 19 ఏళ్ల వయసులో తొలి విశ్వ క్రీడల్లో నాలుగు ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్స్‌, ఒక కాంస్యంతో మొత్తం అయిదు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన బైల్స్‌ ఇప్పుడు వివాహం తర్వాత బరిలోకి దిగుతోంది. కొద్దికాలం పాటు ఆటకు దూరంగా ఉన్న ఈ సంచలనం ఈ విశ్వ క్రీడల్లో ఏం చేస్తుందో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Pawan Kalyan Land: పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
Embed widget