Paris Olympics 2024: బ్రిటన్‌కు షాకిచ్చిన భారత్, పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్ చేరిన హాకీ టీమ్
India Oust Great Britain To reach SemiFinals | పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వరుసగా రెండో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సెమీఫైనల్ చేరుకుని పతకం దిశగా సాగుతోంది.
Paris Olympics 2024 India Mens Hockey Oust Great Britain To reach SemiFinals | పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ హాకీ టీమ్ సత్తా చాటింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చివరి వరకూ పోరాడి షూటౌట్ లో విజయం సాధించింది. మొదట నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి భారత్, బ్రిటన్ జట్లు 1-1 గోల్స్ తో సమంగా నిలవడంతో మ్యాచ్ టై అయింది. దాంతో విజేతను తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్ లో భారత హాకీ పురుషుల జట్టు 4 - 2 గోల్స్ తేడాతో బ్రిటన్‌ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
తొలి క్వార్టర్ టైంలో బ్రిటన్, భారత్ టీంలు గోల్ ఖాతా తెరవలేదు. కానీ రెండో క్వార్టర్ లో భారత్ షాక్ తగిలింది. కొంత సమయానికే భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ప్లేయర్ ను కొట్టాడని భావించిన రిఫరీలు రోహిదాస్‌కు రెడ్‌కార్డ్ చూపించారు. దాంతో మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పారు. అక్కడినుంచి భారత్ 10 మంది ప్లేయర్లతోనే ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ తో గోల్ చేశాడు. దాంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆపై బ్రిటన్ ప్లేయర్ మోర్టన్ లీ 27వ నిమిషంలో గోల్ కొట్టడంతో ఇరు జట్ల స్కోర్ సమం అయింది. మూడు, నాలుగు క్వార్టర్స్‌లో ఏ టీమ్ గోల్ చేయలేకపోయాయి. మ్యాచ్ టై కావడంతో షూటౌట్‌కు కు వెళ్లగా.. భారత్ 4 గోల్స్ చేస్తే, బ్రిటన్ 2 గోల్స్ చేయడంతో టీమిండియా హాకీ టీమ్ పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్ చేరింది.
A famous victory!!!!
— Hockey India (@TheHockeyIndia) August 4, 2024
What a game. What a Shootout.
Raj Kumar Pal with the winning penalty shot.
We are in the Semis.
India India 🇮🇳 1 - 1 🇬🇧 Great Britain
SO: 4-2
Harmanpreet Singh 22' (PC)
Lee Morton 27' #Hockey #HockeyIndia #IndiaKaGame #HockeyLayegaGold… pic.twitter.com/S01hjYbzGr
భారత హాకీ జట్టు అద్భుతాలు చేస్తోంది. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది. 52 ఏళ్ల తరువాత ఒలింపిక్స్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2021లో కాంస్య పతకం సాధించి మెడల్ నిరీక్షణకు తెరదించిన జట్టు ఈ ఒలింపిక్స్‌లోను దూసుకుపోతోంది. శుక్రవారం జరిగిన హాకీ పూల్ బీ చివరి మ్యాచ్‌లో భారత్ 3-2 గోల్స్ తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్ చేరింది. 1972 ఒలింపిక్స్ తర్వాత ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా తరఫున థామస్ క్రెయిగ్, బ్లేక్ గోవర్స్ గోల్ చేయగా, భారత్ తరఫున అభిషేక్, హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి జట్టును గెలిపించారు.