అన్వేషించండి

Paris Olympics 2024: ఇక మొదలెడదామా ?, నేడే ఒలింపిక్స్‌ ఆరంభం

Olympic Games Paris 2024: ప్రపంచంలో అతిపెద్ద క్రీడాకుంభమేళా ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. తరబడి కఠోర సాధన చేసిన వేలాది అథ్లెట్లు.. తమ పతక కలను సాకారం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

Paris 2024 Olympics Opening ceremony Schedule: 
క్రీడల మహా కుంభమేళా నేడు ఆరంభం కానుంది. క్రీడాభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న విశ్వ క్రీడలు పారిస్‌(Paris) వేదికగా నేడు అంగరంగ వైభవం ఆరంభం కానున్నాయి. ఏళ్ల తరబడి కఠోర సాధన చేసిన అథ్లెట్లు.. తమ పతక కలను సాకారం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దిగ్గజాల మెరుపులు... కొత్త ఛాంపియన్‌ల రాక కోసం క్రీడా ప్రపంచం ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. గత విశ్వ క్రీడలు కరోనా నిబంధనల కారణంగా కఠిన నిబంధనల మధ్య జరగగా ఈ ఒలింపిక్స్‌ స్వేచ్ఛాయుతంగా జరగనున్నాయి. చరిత్రలో తొలిసారి ఆరంభ వేడకులు స్టేడియంలో కాకుండా బయట నిర్వహిస్తున్నారు. పారిస్‌ నడిబొడ్డున జరిగే ఈ వేడుకలను చూసేందుకు అతిరథ మహారథులు అందరూ ఇప్పటికే ఫ్రాన్స్‌(France) రాజధానికి చేరుకున్నారు. పటిష్ట భద్రత మధ్య.. 10 వేల 500 మంది అథ్లెట్లు చేసే కవాతును చూసేందుకు క్రీడా ప్రపంచం ఎదురుచూస్తోంది.
 
అంతా సిద్ధం..
నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు మన కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఆరంభం కానున్నాయి. పారిస్‌లోని సెన్‌ నది వేదికగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. సెన్‌ నదిపై ఆరు కిలోమీటర్ల దూరం... 205 దేశాలకు చెందిన 10 వేల 500 మంది అథ్లెట్లు పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్‌ కోసం 94 పడవలను సిద్ధం చేశారు. ఈ 94 పడవల్లో అథ్లెట్లు ఆరు కిలోమీటర్లు దూరం అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. పరేడ్‌లో మొదటగా గ్రీస్‌ పరేడ్‌ నిర్వహించడనుండగా... 84వ దేశంగా భారత్‌ కవాతు నిర్వహించనుంది. 205వ దేశంగా చివరగా ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌ పరేడ్‌లో పాల్గొననుంది.
 
పటిష్ట భద్రత
ఆరంభ వేడుకలకు దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు హాజరవుతారన్న అంచనాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పారిస్‌ చుట్టూ 150 కిలోమీటర్ల మేర ఇప్పటికే నో ఫ్లై జోన్‌ను ప్రకటించారు. ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలకు ముందే విమానాలు వెళ్లకుండా పారిస్‌ గగనతలాన్ని మూసేస్తారు. ‌డ్రోన్లు, జాగిలాలు, సీసీ కెమెరాలు, కృత్రిమ మేథ ఇలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫైటర్‌ జెట్లు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో భద్రతను కల్పించారు. భారత్‌కు చెందిన కే9 జాగిలాలు కూడా భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి.
 
భారత్‌ ఇలా..
మొత్తం 117 మంది భారత అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్నారు. కనీసం 10 పతాకాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. నీరజ్‌ చోప్రా, సింధు, షూటర్లు, ఆర్చరీ ఈవెంట్‌లపై భారత్‌కు భారీగా అంచనాలు ఉన్నాయి. ఆర్చర్లు ఇప్పటికే శుభారంభం చేశారు. దీంతో భారత్‌ గత రికార్డులను బద్దలుకొడుతూ ఈసారి అద్భుతాలు చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget