Paris Olympics 2024: నేడు సింధు, లవ్లీనా మ్యాచ్‌లు, పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ్టీ భారత షెడ్యూల్
Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు ముందుకు సాగుతున్నారు. ఐదవ రోజు భారత స్టార్ అథ్లెట్లు తమ తదుపరి రౌండ్ మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు.
India at Olympics on Day 5 Schedule: పారిస్ ఒలింపిక్స్(Paris olympics)లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. మను బాకర్ వరుసగా రెండు పతకాలు అందించింది. ఇక మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు ముందుకు సాగుతున్నారు. ఇవాళ భారత స్టార్ అథ్లెట్లు తమ తదుపరి రౌండ్ మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) ఇవాళ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను ఆడనుంది. తొలి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన సింధు ఈ మ్యాచ్‌లోనూ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు గెలిచిన సింధు.. మూడో పతకంపైనా కన్నేసింది. ఇక బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్(Lovlina) కూడా రౌండ్ ఆఫ్ 16లో అమీతుమీ తేల్చుకోనుంది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో వరుసగా రెండు విజయాలు సాధించిన లక్ష్యసేన్ నేడు బరిలో దిగనున్నాడు. ప్రణోయ్ మ్యాచ్ కూడా నేడే జరగనుంది. షూటింగ్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్. స్వప్నిల్ కుసాలే పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్స్ ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నారు. టేబుల్ టెన్నిస్‌లో తెలుగు తేడం ఆకుల శ్రీజ మ్యాచ్ కూడా నేడే జరగనుంది.