అన్వేషించండి
Manu Bhaker: అతడే నా డార్లింగ్, సౌత్ హీరోపై మను బాకర్ కామెంట్స్
Manu Bhakar Favourite Actor: పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ ఒక కార్యక్రంలో తన ఫేవరేట్ హీరో సౌతిండియా హీరో ఎవరో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్.
![Manu Bhaker: అతడే నా డార్లింగ్, సౌత్ హీరోపై మను బాకర్ కామెంట్స్ Olympic medal winner Manu Bhaker calls Thalapathy Vijay her darling Manu Bhaker: అతడే నా డార్లింగ్, సౌత్ హీరోపై మను బాకర్ కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/21/f590ee804e7715241bdfc37fd47c9bcd17242190644041036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సౌత్ హీరోపై మను బాకర్ కామెంట్స్
Source : Twitter
Olympic medalist Manu Bhaker"s darling Thalapathy Vijay: దేశవ్యాప్తంగా ఇప్పుడు మను బాకర్(Manu Bhaker) పేరు మార్మోగిపోతోంది. సన్మానాలు, సత్కారాలు, కార్యక్రమాలతో మను బాగా బిజీ అయిపోయింది. పారిస్ ఒలింపిక్స్(Paris Olympic 2024)లో రెండు పతకాలతో సత్తా చాటిన మను బాకర్‌కు దేశవ్యాప్తంగా ఘన సత్కారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ స్టార్ షూటర్ చేసిన వ్యాఖ్యలతో తలపతి విజయ్(Manu Bhaker) అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నా డార్లింగ్... విజయే అంటూ మను బాకర్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విజయ్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దులే లేకుండా పోయింది. విశ్వ క్రీడల్లో సత్తా చాటిన మను తమ హీరోకు పెద్ద అభిమాని అని చెప్పడంతో తలపతి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మను ఏమందంటే..?
పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలతో స్టార్ షూటర్ మను భాకర్ సత్తా చాటింది. మరో పతకం త్రుటిలో చేజారింది. ఈ రెండు పతకాలతో మను దేశంలో స్టార్‌గా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు మనును సత్కరిస్తున్నాయి. దీంతో మను బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మనుభాకర్ చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. మను బాకర్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్టార్ షూటర్‌ను తమిళనాడు సర్కార్ ఘనంగా సత్కరించడంతో పాటు ఆమెకు నగదు బహుమతిని కూడా అందించింది. ఈ సందర్భంగా మను బాకర్‌తో స్టాలిన్ సరదాగా సంభాషించారు. తాను ఎవరో గుర్తు పట్టాలని స్టాలిన్... మను బాకర్‌ను సరదాగా ప్రశ్నించారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిని గుర్తించడంలో మనుబాకర్ కాస్త ఇబ్బంది పడింది. అయితే స్టాలిన్... వెంటనే తలపతి విజయ్ గురించి ప్రశ్నించారు. దీనిపై మను బాకర్ స్పందించింది. విజయ్... తన ఫేవరేట్ హీరో అని... తన డార్లింగ్ అని మను వ్యాఖ్యానించింది.
Olympic Shooter #ManuBhaker Teveals Her Fan Moment For #Thalapathy @actorvijay ❤️pic.twitter.com/GH7R5wG2gx
— Thalapathy Vijay Rasigai (@SubaLak79141886) August 20, 2024
సోషల్ మీడియాలో వైరల్...
ప్రస్తుతం మను బాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ తన డార్లింగ్ అంటూ మను బాకర్ చేసిన వ్యాఖ్యలతో తలపతి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒలింపిక్ ఛాంపియన్ కూడా మా అన్న ఫ్యానే అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. డార్లింగ్ అంటూ మను బాకర్ అన్న వ్యాఖ్యల వీడియోను వైరల్ చేసేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ పోస్ట్‌లు, రీ పోస్ట్‌లతో సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. విజయ్ తదుపరి సినిమా గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను వెంకట్ ప్రభు తెరకెక్కించారు. మరోవైపు ఇప్పటికే రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్... శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని విజయ్ భావిస్తున్నాడు. మరోవైపు మను బాకర్ తదుపరి షూటింగ్ పోటీలకు సిద్ధమవుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion