అన్వేషించండి
Advertisement
Manu Bhaker-Neeraj Chopra: అవునా! నిజమా! నీరజ్ చోప్రా, మను బాకర్ ప్రేమ! పెళ్లి?
Neeraj Chopra Manu Bhaker: ఒలింపిక్స్ పతకాలు సాధించిన తరువాత అత్యంత క్రేజ్ ఉన్న భారత అథ్లెట్లు గా మారారు నీరజ్ చోప్రా, మను బాకర్. వీరిద్దరూ సోమవారం పారిస్‌లో కలిసి కనపడ్డారు. ఇంకేముంది...
Manu Bhaker and her mother chat with Neeraj Chopra. Internet buzzes with rumors:
నీరజ్ చోప్రా-మను బాకర్(Neeraj Chopra-Manu Bhaker) పెళ్లి చేసుకోబోతున్నారా... ఈ ఒలింపిక్ (Olympics) పతకధారులు ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారా... తన కూతురిని వివాహం చేసుకోమని మను బాకర్ తల్లి సుమేధ... నీరజ్ చోప్రాతో ఒట్టు కూడా వేయించుకున్నారా... వీరి వివాహానికి అంతా సిద్ధమైపోయిందా... ఇక బాజాభజంత్రీలు మూగడమే మిగిలిందా... త్వరలోనే అంగరంగ వైభవంగా మనుబాకర్- నీరజ్ చోప్రా పెళ్లి జరగనుందా... ఇవే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. నీరజ్ చోప్రాతో మనూ బాకర్ పెళ్లి కుదిరిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన తర్వాత షూటర్ మను బాకర్, జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా సిగ్గుపడుతూ మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దాంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్లతో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడుకుంటున్న నీరజ్, మనును ఫోటో తీసేందుకు మనూ తల్లి సుమేధ ప్రయత్నించారు. అయితే వద్దంటూ మను బాకర్ వారించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో నీరజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన మను తల్లి సుమేధ.. తలపై ఒట్టు వేయించుకోవడంతో ఈ ఊహాగానాలను మరింత ఆజ్యం పోసింది.
Neeraj Chopra and Manu Bhaker are talking to each other as if they have a crush on each other. I am getting wild ideas on getting India a couple of future super athletes. pic.twitter.com/KXsTZDGq8y
— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) August 11, 2024
ఏమైంది.. ఏం జరిగింది..
నీరజ్-మనుబాకర్‌కు సంబంధించిన ఒకే వీడియోతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న చర్చ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఈ ఇద్దరు అథ్లెట్లు చాలా క్లోజ్ గా ఉండటం.. మను బాకర్ కాస్త సిగ్గుపడుతూ మాట్లాడుతుండడంతో వీరిద్దరి మధ్య కథ చాలా దూరం నడిచేలా ఉందని కూడా నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరూ స్నేహితులా... ప్రేమికులా అని చాలామంది కామెంట్లు చేస్తున్నాురు. ఇంతకీ నీరజ్‌తో మను బాకర్ తల్లిపై తలపై ఒట్టు ఎందుకు వేయించుకున్నారు... తమ ఇద్దరినీ ఫోటో తీస్తుంటే మనుభాకర్ ఎందుకు వారించారు... ఫోటో తీస్తే అసలు ఏమవుతుంది... నీరజ్ చోప్రాతో మను బాకర్ తల్లి సుమేధ ఏం మాట్లాడారు... మనుభాకర్, నీరజ్ చోప్రాకు ఇంతకుముందే పరిచయం ఉందా అన్న ప్రశ్నలు నెటిజన్లు సంధిస్తున్నారు. వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. ఏది ఏమైనా నెట్టింట ఈ వీడియా వైరల్ గా మారడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉన్నట్టు మాత్రం చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7
— Avinash Aryan (@avinasharyan09) August 11, 2024
గతంలో ఎప్పుడూ లేదు
మనూ బాకర్-నీరజ్ చోప్రా గతంలో ఎప్పుడూ కలిసి కనపడలేదు. అయినా సరే ఈ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. నీరజ్ గురించి ఇప్పటివరకూ ప్రేమకు సంబంధించి ఎలాంటి ఊహాగానాలు వినపడలేదు. ప్రస్తుత ఒలింపిక్స్ సందర్భంగా మను బాకర్ తో అతను క్లోజ్ మూవ్ అయిన విధానం చూసి చాలా మంది వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అటు నీరజ్ గానీ, ఇటు మను బాకర్ కానీ స్పందించలేదు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion