Sandeep Lamichhane: అత్యాచారం కేసులో సందీప్‌కు ఊరట - షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
అత్యాచారం కేసులో సందీప్ లమిచనేకు బెయిల్ లభించింది.
Sandeep Lamichhane: నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానేకు రిలీఫ్ న్యూస్ వచ్చింది. అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 13వ తేదీన శుక్రవారం నాడు సందీప్ విడుదల కానున్నారు. కొన్ని షరతులతో లమిచానేను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందులో ఆయన దేశం నుంచి వెళ్లేందుకు కొన్ని షరతులు విధించారు. రూ.20 లక్షల రూపాయలు ఇవ్వాలనే షరతుపై బెయిల్ పొందనున్నారు.
సందీప్ లమిచానే తరపు న్యాయవాది సరోజ్ ఘిమిరే మాట్లాడుతూ, "విదేశాలకు వెళ్లేందుకు కొన్ని షరతులతో రూ.20 లక్షల పూచీకత్తుపై రేపు విడుదల చేయనున్నారు" అని తెలిపారు. 16 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల లమిచానే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత అతను విదేశాల నుండి తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.
హోటల్ గదిలో అత్యాచారం?
ఖాట్మండులోని ఓ హోటల్‌లో లామిచానే తనపై ఈ దారుణమైన చర్యకు పాల్పడ్డాడని 17 ఏళ్ల బాధితురాలు ఆరోపించింది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం... లమిచానే ముందుగా ఆమెను ఖాట్మండు, భక్తపూర్‌లోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఖాట్మండులోని ఓ హోటల్ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి లమిచానేను తొలగించారు. ఈ సంఘటన 2022 ఆగస్టు 21వ తేదీన జరిగిందని బాలిక తెలిపింది.
ఐపీఎల్‌లో కూడా లమిచానే ఆడటం గమనార్హం. ఐపీఎల్‌లో మొత్తం ఇతను తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. లెగ్ స్పిన్నర్ ఈ తొమ్మిది మ్యాచ్‌ల్లో 22.46 సగటుతో 13 వికెట్లు తీశాడు. అతను 2018లో IPL అరంగేట్రం చేసాడు. ఢిల్లీ తరపున లమిచానే IPL ఆడాడు. ఐపీఎల్‌లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ ఇతనే.
View this post on Instagram
View this post on Instagram