News
News
X

Legends League Cricket: ఇండియా మహారాజాస్‌తో వరల్డ్‌ జెయింట్స్‌ ఢీ! మ్యాచ్‌ ఎన్నింటికి? లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎందులో?

Legends League Cricket 2022: క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. నేటి ఇండియా మహారాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

FOLLOW US: 

Legends League Cricket 2022: క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. దిగ్గజాల ఆటను మరోసారి వీక్షించేందుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఒకప్పుడు అభిమానులను అలరించిన గౌతమ్‌ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సహా అనేక మంది మాజీ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. నేటి ఇండియా మహారాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. 

ఎన్ని జట్లంటే

ఈ లీగ్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ జట్లు తలపడనున్నాయి. 

కెప్టెన్స్

ఇండియా క్యాపిటల్స్ - గౌతమ్‌ గంభీర్
గుజరాత్ జెయింట్స్ -  వీరేంద్ర సెహ్వాగ్
మణిపాల్ టైగర్స్   -  హర్భజన్ సింగ్
భిల్వారా కింగ్స్  -  ఇర్ఫాన్ పఠాన్

సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు 20 రోజులపాటు అలరించనున్నాయి. 17వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా క్యాపిటల్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 18న లక్నోలో మణిపాల్ టైగర్స్- భిల్వారా కింగ్స్ పోటీపడనున్నాయి.

లెజెండ్ లీగ్ క్రికెట్ ఫార్మాట్

లీగ్ దశలో 12 మ్యాచులు ఉంటాయి. టోర్నీలో ఉన్న 4 జట్లు ఒక్కో జట్టు మరో దానితో రెండు సార్లు తలపడతాయి. మ్యాచుకు మ్యాచుకు మధ్య 4 రోజుల విశ్రాంతి ఉంటుంది. లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ కు చేరుకుంటాయి. 

లీగ్ దశ ముగిసే సమయానికి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు అక్టోబర్ 2న జోధ్‌పూర్‌లోని బర్కతుల్లా ఖాన్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్‌లో ఆడతాయి. ఇందులో విజేత నేరుగా అక్టోబర్ 5న జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుకు ఇంకో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్ లో మూడో స్థానంలో నిలిచిన జట్టుతో గెలిస్తే ఫైనల్ కు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగుతుంది. 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే సెప్టెంబర్ 25న ఇండియా క్యాపిటల్స్- గుజరాత్ జెయింట్ ల మధ్య జరిగే మ్యాచ్, ఇంకా అక్టోబర్ 2న జరిగే క్వాలిఫైయర్ మ్యాచులు సాయంత్రం 4.00 గంటలకు జరుగుతాయి. 

ఈ మ్యాచులు సోనీ లివ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంకా స్టార్ స్పోర్ట్స్ టీవీలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 

ఎల్ ఎల్ సీ మ్యాచులు జరిగే వేదికలు

లీగ్ మ్యాచులు కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, కటక్, జోధ్ పూర్ లలో జరుగుతాయి. మొదటి క్వాలిఫయర్ జోధ్‌పూర్‌లో జరగనుంది. ఎలిమినేటర్ మరియు ఫైనల్‌కు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తారు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం టిక్కెట్లు ఇలా పొందవచ్చు.

మ్యాచ్‌ల టిక్కెట్లు బుక్ మై షో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్- వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగే ప్రత్యేక బెనిఫిట్ మ్యాచ్ టికెట్లు కూడా అభిమానుల కోసం అందుబాటులో ఉంచారు. 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 పూర్తి షెడ్యూల్

శుక్రవారం, 16 సెప్టెంబర్- ప్రత్యేక మ్యాచ్: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
శనివారం, 17 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
ఆదివారం, 18 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (7:30 pm; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
సోమవారం, 19 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
బుధవారం, 21 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
గురువారం, 22 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
శనివారం, 24 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
ఆదివారం, 25 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (సాయంత్రం 4:00; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
సోమవారం, 26 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
మంగళవారం, 27 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
గురువారం, 29 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
శుక్రవారం, 30 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30 బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
శనివారం, 1 అక్టోబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
ఆదివారం, 2 అక్టోబర్- క్వాలిఫైయర్ (ర్యాంక్ 1 vs ర్యాంక్ 2) (రాత్రి 4 గంటలకు; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
సోమవారం, 3 అక్టోబర్- ఎలిమినేటర్ (ర్యాంక్ 3 vs లూజర్ ఆఫ్ Q1) ( రాత్రి 7:30 , వేదిక ప్రకటించాల్సి ఉంది.)
బుధవారం, 5 అక్టోబర్- ఫైనల్ (క్వాలిఫైయర్ విజేత vs ఎలిమినేటర్ విజేత) (రాత్రి 7:30 వేదిక ప్రకటించాల్సి ఉంది.)

Published at : 16 Sep 2022 12:27 PM (IST) Tags: Sehwag Legends League Cricket 2022 Legends League Cricket 2022 schedule Legends League Cricket 2022 matches Legends League Cricket 2022 news LLC 2022 schedule gambhir

సంబంధిత కథనాలు

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

India Wicket Keeper T20 WC: పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

India Wicket Keeper T20 WC:  పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

IND vs AUS T20I: రెండో టీ20లో హిట్‌మ్యాన్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

IND vs AUS T20I: రెండో టీ20లో హిట్‌మ్యాన్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?