అన్వేషించండి

Virat Kohli: టీమ్‌ఇండియా కోసం నా టార్గెట్‌ అదేనంటున్న కోహ్లీ!

Virat Kohli: దేశానికి ఆసియాకప్‌, ప్రపంచకప్‌ అందించడమే తన లక్ష్యమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అంటున్నాడు. అందుకు ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించాడు.

Virat Kohli: దేశానికి ఆసియాకప్‌, ప్రపంచకప్‌ అందించడమే తన లక్ష్యమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)  అంటున్నాడు. అందుకు ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించాడు. త్వరలోనే పరుగుల వరద పారిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ప్యారిస్‌లో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు సెంచరీ కొట్టి మూడేళ్లు అవుతోంది. ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీసులోనూ అతడు రాణించలేదు. ఫామ్‌ లేమితో బాధపడుతున్న జట్టు అండగా నిలిచింది. అయితే మానసికంగా కాస్త విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీసులకు ఎంపిక చేయలేదు.

ఆగస్టులో టీమ్‌ఇండియా ఆసియాకప్‌ ఆడుతుంది. అక్టోబర్‌-నవంబర్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తలపడుతుంది. ఈ రెండింటినీ గెలవాలంటే విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం అత్యవసరం. ఒకవేళ అతడు గనక ఇబ్బంది పడితే జట్టుకు భారంగా మారతాడు. ప్రొఫెషనల్‌ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగుల చేసిన అతడిని జట్టు నుంచి తప్పించడం అంత సులభం కాదు. పైగా అతనుంటే ప్రత్యర్థులకు ఒక రకమైన భయం ఉంటుంది. అందుకే అతడు ఫామ్‌ అందుకోవడం ముఖ్యం. అయితే జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని విరాట్‌ అంటున్నాడు.

'ఆసియా కప్‌, ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను గెలిపించడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకు జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను' అని అతడు స్టార్‌స్పోర్ట్స్‌కు తెలిపాడు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని స్టార్‌ ట్వీట్‌ చేసింది. 

ఇంటర్నేషనల్‌ క్రికెట్లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) 2019, నవంబర్‌ 13న చివరి సెంచరీ కొట్టాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన గులాబి టెస్టులో శతకబాదాడు. 136 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది 70వ శతకం. ఆ తర్వాత సిరీసులోనే ఒకట్రెండు శతకాలు బాదేసి రికీ పాంటింగ్‌ 71 సెంచరీల రికార్డు బద్దలు కొట్టేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇప్పుడు మూడేళ్లు గడుస్తున్నాయి. ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసాయే తప్ప విరాట్‌ బ్యాటు నుంచి వంద రాలేదు.

ఇప్పటి వరకు 102 టెస్టులాడిన కోహ్లీ 50 సగటుతో 8074 పరుగులు చేశాడు. 262 వన్డేల్లో 57 సగటుతో 12344, 99 టీ20ల్లో 50 సగటుతో 3308 రన్స్‌ సాధించాడు. రెండు ఫార్మాట్లలో కలిసి 70 సెంచరీలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఏటా 2000 రన్స్‌ చేసే కింగ్‌ కోహ్లీ 2020లో 842, 2021లో 964, 2022లో 459 మాత్రమే సాధించాడు. అతడు త్వరగా ఫామ్‌ అందుకోవాలని అభిమానులు, టీమ్‌ఇండియా కోరుకుంటోంది.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget