ప్రపంచ అథ్లెటిక్స్‌లో రజతం కొల్లగొట్టిన నీరజ్‌ చోప్రా

అత్యున్నత వేదికల్లో భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు నీరజ్‌ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్‌ జావెలిన్‌ త్రోలో నేడు రజత పతకం కైవసం చేసుకున్నాడు

2003లో అంజూ బాబి జార్జ్‌ తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్‌లో కాంస్యం అందించింది.

అంజూ తర్వాత దాదాపు 20 ఏళ్లకు నీరజ్‌ రజతంతో చరిత్ర సృష్టించాడు.

ఫైనల్లో ఈటెను 88.13 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.

గతంలో ఒలింపిక్స్‌లోనూ నీరజ్‌ స్వర్ణం అందించాడు.

ఒలింపిక్‌ అథ్లెటిక్స్‌లో వందేళ్ల తర్వాత దేశానికి పతకం సాధించాడు.

90 మీటర్ల గోల్డెన్‌ మార్క్‌ను అందుకోవాలని నీరజ్‌ కష్టపడుతున్నాడు.

ఈ మధ్యే 89.94 మీటర్లు విసిరి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.