ఆడదోమలే ఎందుకు రక్తం తాగుతాయి? మనుషుల్ని కుట్టేవన్నీ ఆడదోమలే. మగదోమలు కుట్టవు. మన రక్తాన్ని ఆడదోమలు ఆకలి తీర్చుకోవడం కోసం కాదు, శారీరక అవసరాల కోసమే తాగుతాయి. ఆడదోమలు పునరుత్పత్తి చేయాలంటే మనుషుల రక్తం అవసరం. ఆడదోమల్లో అండాల ఫలదీకరణకు, గుడ్డు పెట్టేందుకు ఆ రక్తం ఉపయోగపడుతుంది. అందుకే ఆడదోమలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. దోమల తలపై యాంటెన్నాలాంటివి ఉంటుంది. అది వాసనలను గ్రహిస్తుంది. ఏ మనిషి దగ్గర అయితే లాక్టిక్ యాసిడ్ వాసన అధికంగా వస్తుందో వారినే వెళ్లి కుడుతుందట ఏడిస్ ఈజిప్టి ఆడదోమ. మగదోమలు అసలు రక్తాన్ని తాగవు. మనుషులను కుట్టవు.