D Gukesh: ధోనీనే నాకు స్ఫూర్తి , విషీకి రుణపడి ఉంటా: గుకేశ్
Gukesh D: తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పాత్ర ఎంతో ఉందని గుకేష్ చెప్పాడు. దిగ్గజాలు ధోనీ, జొకోవిచ్‌ను తానెంతో అభిమానిస్తానని చెప్పాడు.

Gukesh D Picks MS Dhoni And Tennis Great As Inspirations: ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత యువ సంచలనం గుకేశ్(D Gukesh) తనకు ప్రేరణగా నిలిచిన వారు ఎవరూ బహిర్గతం చేశాడు. తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్(Viswanath Anand) పాత్ర ఎంతో ఉందని గుకేష్ చెప్పాడు. దిగ్గజాలు ధోనీ(MS Dhoni), జొకోవిచ్(Novak Djokovic)ను తానెంతో అభిమానిస్తానని చెప్పాడు. ఎంతో ఒత్తిడిలో అత్యుత్తమ ప్రదర్శన చేసే వారిద్దరూ తనకు స్ఫూర్తి అని అన్నాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఆరంభం నుంచి మంచి లయతోనే ఉన్నానని... గెలుస్తాననే ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగానని గుకేశ్ తెలిపాడు. ఈ టోర్నీ గెలవడంలో సాయపడ్డ తన తల్లిదండ్రులు, కోచ్, కుటుంబం, పాఠశాల, తమిళనాడు ప్రభుత్వానికి గుకేశ్ ధన్యవాదాలు తెలిపాడు. విశ్వనాథన్ ఆనంద్ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాణ్నే కాదని గుకేశ్ అన్నాడు. వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో శిక్షణ పొందిన గుకేశ్.. ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. తన కెరీర్‌లో విశ్వనాథన్ ఆనంద్ ప్రధాన పాత్ర పోషించారని... ఆయన అకాడమీ నుంచి ఎంతో లబ్ధి పొందానని... ఆయనకు రుణపడి ఉంటానని గుకేశ్ తెలిపాడు. ఆయన లేకపోతే ఈ స్థాయి కాదు కదా దరిదాపుల్లోకి కూడా వచ్చేవాణ్ని కాదని తెలిపాడు.





















