Arjuna Award 2023: పేసర్ షమీకి అర్జున అవార్డ్, మరో 25 మంది ఆటగాళ్లకు సైతం అర్జున పురస్కారం
Arjuna Award Mohammed Shami: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను అత్యున్నత క్రీడా పురస్కారాలతో గౌరవించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రకటించారు.
National Sports Awards 2023: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను అత్యున్నత క్రీడా పురస్కారాలతో గౌరవించింది. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ద్రోణాచార్య, ఖేల్ రత్న, అర్జున అవార్డు (Arjuna Awards 2023) విజేతలను ప్రకటించింది. తెలుగు తేజం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురానికి చెందిన రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ (Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ జోడీకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ప్రకటించి వారిని గౌరవించింది. ఐదుగురు అత్యుత్తమ కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులు, మొత్తం 26 మంది ఆటగాళ్లకు అర్జున అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Arjuna Award For Mohammed Shami )ని అర్జున అవార్డు వరించింది.
అర్జున అవార్డులు 2023 విజేతలు వీరే..
1. మహ్మద్ షమీ (క్రికెట్)
2. అదితి గోపీచంద్ స్వామి (ఆర్చర్)
3. ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్)
4. పారుల్ చౌదరి (అథ్లెటిక్స్)
5. మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్)
6. ఆర్ వైశాలి (చెస్)
7. ఓజస్ ప్రవీణ్ డియోటలే (ఆర్చర్)
8. అనూష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్)
9. దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్)
10. దీక్షా దాగర్ (గోల్ఫ్)
11. క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ)
12. సుశీల చాను (హాకీ)
13. పవన్ కుమార్ (కబడ్డీ)
14. రీతు నేగి (కబడ్డీ)
15. నస్రీన్ (ఖోఖో)
16. పింకి (లాన్ బౌల్స్)
17. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)
18. ఈషా సింగ్ (షూటింగ్)
19. హరీందర్ పాల్ సింగ్ సంధూ (స్క్వాష్)
20. అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
21. సునీల్ కుమార్ (రెజ్లింగ్)
22. ఆంటిమ్ (రెజ్లింగ్)
23. నౌరెమ్ రోషిబినా దేవి (వుషు)
24. శీతల్ దేవి (పారా ఆర్చరీ)
25. ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)
26. ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్)