Legends League Cricket 2022: గంభీర్, సెహ్వాగ్ డిష్యూం డిష్యూం! లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తలపడుతున్న దిగ్గజాలు
క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. సెప్టెం బర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి.
Legends League Cricket 2022: క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. దిగ్గజాల ఆటను మరోసారి వీక్షించేందుకు సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో అంటే సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది.
ఎన్ని జట్లంటే
ఈ లీగ్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
కెప్టెన్స్
ఇండియా క్యాపిటల్స్ - గౌతం గంభీర్
గుజరాత్ జెయింట్స్ - వీరేంద్ర సెహ్వాగ్
మణిపాల్ టైగర్స్ - హర్భజన్ సింగ్
భిల్వారా కింగ్స్ - ఇర్ఫాన్ పఠాన్
సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు 20 రోజులపాటు అలరించనున్నాయి. 17వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా క్యాపిటల్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 18న లక్నోలో మణిపాల్ టైగర్స్- భిల్వారా కింగ్స్ పోటీపడనున్నాయి.
లెజెండ్ లీగ్ క్రికెట్ ఫార్మాట్
లీగ్ దశలో 12 మ్యాచులు ఉంటాయి. టోర్నీలో ఉన్న 4 జట్లు ఒక్కో జట్టు మరో దానితో రెండు సార్లు తలపడతాయి. మ్యాచుకు మ్యాచుకు మధ్య 4 రోజుల విశ్రాంతి ఉంటుంది. లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ కు చేరుకుంటాయి.
లీగ్ దశ ముగిసే సమయానికి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు అక్టోబర్ 2న జోధ్‌పూర్‌లోని బర్కతుల్లా ఖాన్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్‌లో ఆడతాయి. ఇందులో విజేత నేరుగా అక్టోబర్ 5న జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుకు ఇంకో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో మూడో స్థానంలో నిలిచిన జట్టుతో గెలిస్తే ఫైనల్ కు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగుతుంది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే సెప్టెంబర్ 25న ఇండియా క్యాపిటల్స్- గుజరాత్ జెయింట్ ల మధ్య జరిగే మ్యాచ్, ఇంకా అక్టోబర్ 2న జరిగే క్వాలిఫైయర్ మ్యాచులు సాయంత్రం 4.00 గంటలకు జరుగుతాయి.
ఈ మ్యాచులు సోనీ లివ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంకా స్టార్ స్పోర్ట్స్ టీవీలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ఎల్ ఎల్ సీ మ్యాచులు జరిగే వేదికలు
లీగ్ మ్యాచులు కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, కటక్, జోధ్ పూర్ లలో జరుగుతాయి. మొదటి క్వాలిఫయర్ జోధ్‌పూర్‌లో జరగనుంది. ఎలిమినేటర్ మరియు ఫైనల్‌కు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం టిక్కెట్లు ఇలా పొందవచ్చు.
మ్యాచ్‌ల టిక్కెట్లు బుక్ మై షో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్- వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగే ప్రత్యేక బెనిఫిట్ మ్యాచ్ టికెట్లు కూడా అభిమానుల కోసం అందుబాటులో ఉంచారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 పూర్తి షెడ్యూల్
- శుక్రవారం, 16 సెప్టెంబర్- ప్రత్యేక మ్యాచ్: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- శనివారం, 17 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఆదివారం, 18 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (7:30 pm; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
- సోమవారం, 19 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
- బుధవారం, 21 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
- గురువారం, 22 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
- శనివారం, 24 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
- ఆదివారం, 25 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (సాయంత్రం 4:00; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
- సోమవారం, 26 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
- మంగళవారం, 27 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
- గురువారం, 29 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
- శుక్రవారం, 30 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30 బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
- శనివారం, 1 అక్టోబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
- ఆదివారం, 2 అక్టోబర్- క్వాలిఫైయర్ (ర్యాంక్ 1 vs ర్యాంక్ 2) (రాత్రి 4 గంటలకు; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
- సోమవారం, 3 అక్టోబర్- ఎలిమినేటర్ (ర్యాంక్ 3 vs లూజర్ ఆఫ్ Q1) ( రాత్రి 7:30 , వేదిక ప్రకటించాల్సి ఉంది.)
- బుధవారం, 5 అక్టోబర్- ఫైనల్ (క్వాలిఫైయర్ విజేత vs ఎలిమినేటర్ విజేత) (రాత్రి 7:30 వేదిక ప్రకటించాల్సి ఉంది.)
The schedule for #LLCT20 is here. Get ready to catch the #Legends of cricket battling it out starting September 16, 2022.
— Legends League Cricket (@llct20) September 7, 2022
Book your tickets on @bookmyshow and witness some #Boss performances in #LegendsLeagueCricket#Kolkata #Lucknow #Delhi #Cuttack #Jodhpur #BossLogonKaGame pic.twitter.com/dgsi17AHBI
#LLCT20 is proud to announce @StarSportsIndia as the official broadcast partner.@CapitalsIndia @GujaratGiants @Bhilwarakings #ManipalTigers #LegendsLeagueCricket #BossLogonKaGame #BossGame pic.twitter.com/jbT5u75xUb
— Legends League Cricket (@llct20) September 10, 2022