Jasprit Bumrah Injury: టీమ్‌ఇండియాకు షాక్! బౌలింగ్ చేస్తుండగా బుమ్రాకు గాయం.. మైదానంలోనే విలవిల
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా అతడి కుడికాలి మడమ మలుచుకుపోయింది. నొప్పితో అతడు మైదానంలోనే విలవిల్లాడాడు.
సెంచూరియన్ టెస్టులో టీమ్‌ఇండియాకు షాక్! పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా అతడి కుడికాలి మడమ మలుచుకుపోయింది. నొప్పితో అతడు మైదానంలోనే విలవిల్లాడాడు. దాంతో ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. అతడి పరిస్థితిపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ను జస్ప్రీత్ బుమ్రాయే అందించాడు. అద్భుతమైన వేగం, కచ్చితత్వంతో అతడు బంతులు విసిరాడు. 11 ఓవర్ ఐదో బంతిని విసిరగానే ఫాల్‌త్రూలో బుమ్రా కాలి మడమ బలంగా మలుచుకుపోయింది. దాంతో అతడు విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో పరుగెత్తుకొచ్చి అతడిని పరీక్షించాడు. మైదానం నుంచి డ్రస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, సబ్‌స్టిట్యూట్‌గా శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తున్నాడని బీసీసీఐ ట్వీట్ చేసింది.
Bumrah 😢 pic.twitter.com/rX2MaHUdzO
— N (@Nitinx18) December 28, 2021
ప్రస్తుతం దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 27 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. బవుమా (25), డికాక్ (17) బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకు ముందు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 105.3 ఓవర్లకు 327 పరుగులకు కోహ్లీసేన ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (123; 260 బంతుల్లో 16x4, 1x6) శతక మోత మోగించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60; 123 బంతుల్లో 9x4) అర్ధశతకంతో అదరగొట్టాడు. సీనియర్ ఆటగాడు అజింక్య రహానె (48; 102 బంతుల్లో 9x4) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. రాహుల్ ఉన్నంత వరకు అద్భుతంగా ఆడిన భారత్ అతడు ఔటవ్వగానే ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 49 పరుగుల వ్యవధిలో ఆలౌటైంది. లుంగి ఎంగిడి 6, కాగిసో రబాడా 3 వికెట్లు తీశారు. జన్‌సెన్‌కు ఒక వికెట్ దక్కింది.
Update: Jasprit Bumrah has suffered a right ankle sprain while bowling in the first innings.
— BCCI (@BCCI) December 28, 2021
The medical team is monitoring him at the moment.
Shreyas Iyer is on the field as his substitute.#SAvIND
Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్ భావోద్వేగం
Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!
Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!