By: ABP Desam | Updated at : 13 Mar 2023 12:02 AM (IST)
ముంబయి ఇండియన్స్ ఘన విజయం (Photo: Twitter/@wplT20)
WPL 2023, UPW vs MIW: ముంబయి: విమెన్ ప్రీమియర్ లీగ్ లో ముంబయి ఇండియన్స్ మరోసారి సత్తా చాటింది. వరుస విజయాలతో ముంబై జైత్రయాత్ర కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో ఉన్న ముంబై ఇండియన్స్ తాజాగా ఆదివారం నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఆదివారం రాత్రి యూపీ వారియర్స్ పై ఛేజింగ్ చేసి నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓ మోస్తరు లక్ష్యాన్ని ముంబై ముందు నిలిపింది. కానీ పటిష్ట ముంబై జట్టుకు ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఏమాత్రం ఇబ్బంది కాలేదు. 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ముంబై ఇండియన్స్ 164 పరుగులు చేసి విజయఢంకా మోగించింది హర్మన్ ప్రీత్ సేన. నాట్ సీవర్ (45 నాటౌట్; 31 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్), ఓపెనర్ యాస్తిక భాటియా (42; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (53; 33 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ హాఫ్ సెంచరీ చేసింది. దాంతో మరో 15 బంతులు మిగిలుండగానే హర్మన్ ప్రీత్ సేన వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది.
4⃣ in 4⃣! 👏 👏
The winning juggernaut continues for the @ImHarmanpreet-led @mipaltan as they beat #UPW 8 wickets! 👍 👍
Scorecard ▶️ https://t.co/yTrUlbUr5D#TATAWPL | #UPWvMI pic.twitter.com/jZJYMV1ZiN — Women's Premier League (WPL) (@wplt20) March 12, 2023
58 పరుగుల వద్దే ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోగా, మరో వికెట్ పడకుండానే కెప్టెన్ హర్మన్ ప్రీత్, వన్ డౌన్ బ్యాటర్ నాట్ సీవర్ మిగతా పనిని పూర్తి చేశారు. పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూపీ వారియర్స్ బౌలర్లలు రాజేశ్వరి గైక్వాడ్, సోఫీ ఎకిల్ స్టోన్ చెరో వికెట్ తీశారు. కానీ ముంబై బ్యాటర్లకు అడ్డుకట్ట వేయలేకపోయారు.
.@UPWarriorz captain @ahealy77 was the top-scorer for her team and was the top performer from the first innings of the #UPWvMI game 👍 👍 #TATAWPL
— Women's Premier League (WPL) (@wplt20) March 12, 2023
A summary of her batting display 🔽 pic.twitter.com/JTX6yFPwL0
రాణించిన అలీసా హేలీ, మెక్ గ్రాత్
యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగా.. యూపీ బ్యాటర్లలో కెప్టెన్ అలీసా హేలీ (58; 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), తాహిలా మెక్‌గ్రాత్ (50; 37 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. కిరణ్ నవ్‌గిరె (17; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆ తరువాత టాప్ స్కోరర్. దీప్తి శర్మ (7), దేవికా వైద్య (6), ఎకిల్ స్టోన్ (1) విఫలమయ్యారు. యూపీ వారియర్స్ చివరి ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయింది. లేకపోతే ఆ జట్టు మరిన్ని పరుగులు చేసేది. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్ మూడు వికెట్లు పడగొట్టింది. అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ ఒక వికెట్ తీశారు. నిర్ణీత ఓవర్లలో యూపీని 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు కట్టడి చేశారు ముంబై బౌలర్లు.
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?
DCW vs GG,: లారా, యాష్లే చెలరేగినా - భారీ స్కోరు చేయలేకపోయిన గుజరాత్ - ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
SRH New Jersey: ఆరెంజ్ ఆర్మీ ఫైర్ ఇది! కొత్త జెర్సీ విడుదల చేసిన సన్‌రైజర్స్!
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!