Angkrish Raghuvanshi : క్యాన్సర్‌ను తరిమేశాడు- ఢిల్లీని తగలెట్టేశాడు. ఇంతకీ ఎవరీ రఘువంశీ?
IPL 2024 : రఘువంశీ ఒక్కరాత్రిలోనే హీరో అయిపోయి ఉండొచ్చు గానీ... దీని వెనుక చాలా పెద్ద కన్నీటి గాథ ఉంది.
KKR vs DC : ఆంగ్‌క్రిష్ రఘువంశీ. ముంబైకి చెందిన 18 ఏళ్ల టీనేజ్ క్రికెటర్. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున వన్ డౌన్ బ్యాటర్ గా దిగి రఘువంశీ ఆడిన ఫియర్ లెస్ ఇన్నింగ్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. 18ఏళ్లకే ఏదో వంద ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్న వాడిలా అసలు భయం అనేదే లేకుండా బ్యాటింగ్ చేసి డెబ్యూ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. 27బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లతో 54పరుగులు చేసి....ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టిన యంగెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. ప్రత్యేకించి రెండు వైపులా స్విచ్ అవుతూ రఘువంశీ కొడుతున్న షాట్స్, ఆ సిక్సులు అతని క్యాపబులిటీ అందరికీ తెలిసేలా చేశాయి.
Glimpse of Angkrish Raghuvanshi pic.twitter.com/pwiP3e82V3
— Pill (@jaiswalnut) April 3, 2024
ఎక్కువ టైం ఆసుపత్రిలోనే...
ఇదే టైమ్ లో అసలీ రఘువంశీ అని వెతికిన వాళ్లకు అతని పాస్ట్ లైఫ్ చూస్తే ఇన్సపైరింగ్ జర్నీ అనిపించకమానదు. రఘువంశీకి కిషన్ అని ఓ తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు కిషన్ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడాడు. అప్పుడు తమ్ముడి కోసం రఘువంశీ ఐదేళ్ల పాటు ఆసుపత్రుల్లోనే గడిపాడట. తమ్ముడిని చూసుకుంటూ ఆసుపత్రిలో ఉండటం...అక్కడే నిద్రపోవటం ఇవన్నీ చేస్తూ తన తమ్ముడికి క్యాన్సర్ నయం అవ్వటం కోసం చిన్న ఏజ్ లోనే చాలా కష్టపడ్డాడంట రఘువంశీ.
తల్లి తీర్చిదిద్దిన రఘువంశీ
Angkrish Raghuvanshi " My Childhood was not tough but it was tough for my mom and dad because they ensure I should not suffer anything. My aim is to wear India jersey but also wear like no-one has wear before, everyone should look and say I am different"pic.twitter.com/pk0uM7sx9c
— Sujeet Suman (@sujeetsuman1991) April 4, 2024
అదే రఘువంశీ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా చేసిందని తర్వాత క్రికెటర్ గా మారినా ఎవ్వరికీ ఎప్పుడూ భయపడకుండా ఓ ఫియర్ లెస్ బ్యాటర్ గా అతన్ని తీర్చిదిద్దందని రఘువంశీ తల్లి నిన్న మ్యాచ్ తర్వాత మీడియాతో తెలిపారు. 2022లో టీమిండియా అండర్ 19వరల్డ్ కప్ ఆడిన ఆంగ్ క్రిష్ రఘువంశీ 278 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు.
🤩CUTENESS OVERLOAD😍
— KKR Vibe (@KnightsVibe) April 3, 2024
In the innings break, KKR debut batter Angkrish Raghuvanshi is asked about his approach by Harsha Bhogle and the first thing he said is - "Oh, hi, I am so excited to talk to you." pic.twitter.com/lSN1ydXfAt
సీకే నాయుడు ట్రోఫీలోనూ మెరవటంతో కోల్ కతా నైట్ రైడర్స్ రఘవంశీని కొనుక్కుంది. అతని ప్రతిభను, ఫియర్ లెస్ బ్యాటింగ్ ను గమనించిన గంభీర్ నిన్న ఢిల్లీ మీద వన్ డౌన్ లో పంపించి ఆశ్చర్యపరిచాడు. 18ఏళ్ల వయసుకే ఐపీఎల్ ఆడుతూ ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాది తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆంగ్ క్రిష్ రఘువంశీ.