అన్వేషించండి

Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డు - శిఖర్ ధావన్‌ని వెనక్కి నెట్టి!

ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ మరో ప్రత్యేక రికార్డును సృష్టించాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ 2023లో తన ఫాంను తిరిగి తెచ్చుకున్నాడు. దాన్ని ఐపీఎల్ 2023లో కూడా కొనసాగించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయమైన అర్థ సెంచరీతో జట్టును గెలిపించాడు. కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

ఇది విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో 50కి పైగా పరుగులను సాధించడం ఇది 50వ సారి. ఈ మార్కును అందుకున్న మొదటి భారతీయ బ్యాటర్ విరాట్ కోహ్లీనే. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60 అర్థ సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. విరాట్ రెండో స్థానంలో ఉండగా, 49 సార్లు ఈ ఫీట్ సాధించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 45 అర్థ సెంచరీలు, ఐదు సెంచరీలను ఐపీఎల్‌లో సాధించాడు.

ఇక ఐపీఎల్‌ 2023ను బెంగళూరు ఘన విజయంతో ప్రారంభించింది. చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారీ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఛేదించి విజయాన్ని సాధించింది. ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ (82 నాటౌట్: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. కెప్టెన్, మరో ఓపెనర్ ఫాఫ్ డు ఫ్లెసిస్ (73: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏ దశలోనూ ముంబై నుంచి పోటీ ఎదురు కాలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (82 నాటౌట్: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (73: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విరాట్ కోహ్లీ ఏడు పరుగుల వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను జోఫ్రా ఆర్చర్ అందుకోలేకపోయాడు. అది ముంబై పాలిట శాపంగా మారింది. ఓపెనర్లిద్దరూ బౌండరీలతో చెలరేగిపోయారు.

మొదటి వికెట్‌కు 148 పరుగులు జోడించిన అనంతరం అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ (0: 3 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అయితే విరాట్ మాత్రం మ్యాక్స్‌వెల్‌తో (12 నాటౌట్: 3 బంతుల్లో, రెండు సిక్సర్లు) కలిసి టార్గెట్‌ను పూర్తి చేశాడు.

టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కానీ ముంబై టాప్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయింది. రోహిత్ శర్మ (1: 10 బంతుల్లో), ఇషాన్ కిషన్ (10: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్), సూర్యకుమార్ యాదవ్ (15: 16 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. దీంతో ముంబై 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రన్‌రేట్ కనీసం ఆరు పరుగులు కూడా లేదు. ఈ దశలో తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget