WPL 2023 Title Sponser: మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ ను ప్రకటించిన జై షా
Women's Premier League Title sponsor: మహిళల ప్రీమియర్ లీగ్‌కు టైటిల్ స్పాన్సర్ ఎవరో కన్ఫామ్ అయింది. మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న మహిళా ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ నిలిచింది.
Women's Premier League Title sponsor: మహిళల ప్రీమియర్ లీగ్‌కు టైటిల్ స్పాన్సర్ ఎవరో కన్ఫామ్ అయింది. మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న మహిళా ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా మంగళవారం ప్రకటించారు. డబ్ల్యూపీఎల్ 2023 ( WPL 2023 ) నిర్వహణ మీడియా హక్కుల విక్రయం విషయంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) రూ. 951 కోట్లు ఆర్జిస్తోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం రెండు వేదికలపై నిర్వహించనున్నారు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంను బ్యాకప్ గా ఎంపికచేశారు.
డబ్ల్యూపీఎల్ జరిగే తీరిది
- టోర్నీలో మొత్తం 5 జట్లు పాల్గొంటాయి.
- ప్రతి జట్టు ఇంకో జట్టుతో 2 సార్లు తలపడుతుంది.
- పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది.
- 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు రెండో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.
- మార్చి 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
- మొత్తం 4 డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉన్నాయి. లీగ్ దశలో మార్చి 17, 19 తేదీల్లో ఎలాంటి మ్యాచ్ లు లేవు.
I am delighted to announce the #TataGroup as the title sponsor of the inaugural #WPL. With their support, we're confident that we can take women's cricket to the next level. @BCCI @BCCIWomen @wplt20 pic.twitter.com/L05vXeDx1j
— Jay Shah (@JayShah) February 21, 2023
డబ్ల్యూపీఎల్ లో జట్లు ఇవే..
ముంబై ఇండియన్స్ (MI),
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB),
గుజరాత్ జెయింట్స్ (GG),
యూపీ వారియర్స్ (UPW),
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
బీసీసీఐకు భారీగా ఆదాయం
ఇప్పటికే డబ్ల్యూపీఎల్ మీడియా హక్కులు, ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. దీంతో బీసీసీఐకు భారీగా ఆదాయం సమకూరింది. మీడియా హక్కులను వయోకామ్ 18 5 ఏళ్ల కాలానికి రూ. 951 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే 5 ఫ్రాంచైజీలను విక్రయించడం ద్వారా మొత్తం రూ. 4666. 99 కోట్లు బీసీసీఐకు సమకూరాయి.
డబ్ల్యూపీఎల్ లో రికార్డు ధర పలికిన మహిళా ప్లేయర్స్..
అరంగేట్ర మహిళల ప్రీమియర్ లీగ్ లో అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ యాష్లే గార్డ్‌నర్ ను రూ.3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ తీసుకుంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నటాలీ షివర్ ను ముంబయి ఇండియన్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. టీమ్‌ఇండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్, నిలకడకు మారుపేరైన దీప్తి శర్మకు రూ.2.6 కోట్లు దక్కాయి. యూపీ వారియర్స్ ఆమెను సొంతం చేసుకుంది. భారత యువ కెరటం, టాప్ ఆర్డర్లో కీలకమైన జెమీమా రోడ్రిగ్స్ జాక్‌పాట్ కొట్టేసింది. దిల్లీ క్యాపిటల్స్ ఆమెను ఏకంగా రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఓపెనింగ్, వన్‌డౌన్, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఆమె సొంతం.