News
News
X

IPL 2023: డబ్బులు జాగ్రత్తమ్మా - ఖరీదైన ఆటగాళ్లకు రైనా సలహా!

ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన భారత ఆటగాళ్లకు సురేష్ రైనా ఒక సలహా ఇచ్చాడు.

FOLLOW US: 
Share:

Suresh Raina IPL 2023: ఐపీఎల్ 2023 కోసం డిసెంబర్ 23వ తేదీన వేలం పూర్తయింది. కొచ్చిలో జరిగిన ఈ వేలంలో 10 జట్లు చాలా మంది మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధిక ధర పొందిన టాప్-10 ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు భారతీయులు కూడా ఉండటం విశేషం. ఈసారి వేలంలో శామ్ కరన్ ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. శివమ్ మావిని గుజరాత్ టైటాన్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం అనంతరం మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా భారత ఆటగాళ్లకు ప్రత్యేక సలహా ఇచ్చాడు.

వేలంలో ఖరీదైన అమ్ముడైన భారత ఆటగాళ్లకు ఐపీఎల్ వెటరన్ ఆటగాడు సురేశ్ రైనా ప్రత్యేక సలహా ఇచ్చాడు. 'ఇది వారికి స్ప్రింగ్‌బోర్డ్. ఈ ఆటగాళ్లు భారత్‌కు కూడా ఆడవచ్చు. డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. వారి కుటుంబాల కోసం ఇళ్ళు కొనుగోలు చేయవచ్చు. వారి శరీర సంరక్షణ కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇది అత్యంత ముఖ్యమైనది.’ అన్నాడు.

విశేషమేమిటంటే, ఐపీఎల్ వేలం 2023లో మయాంక్ అగర్వాల్ అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అతడిని రూ.8.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. శివమ్ మావిని గుజరాత్ కొనుగోలు చేసింది. ముఖేష్ కుమార్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ పందెం వేసింది. తనను రూ.5.5 కోట్లకు కొనుగోలు చేశారు. రూ.2.6 కోట్లకు వివ్రాంత్ శర్మను హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.2.4 కోట్లకు మనీష్ పాండేను ఢిల్లీ కొనుగోలు చేసింది.

మీరు 2023 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే టాప్-5 లిస్ట్‌లో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కరన్ తర్వాత కామెరాన్ గ్రీన్ రెండవ స్థానంలో ఉన్నారు. రూ.17.5 కోట్లకు అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. రూ.13.25 కోట్లకు హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్ కొనుగోలు చేసింది.

View this post on Instagram
 
A post shared by IPL (@iplt20)

Published at : 25 Dec 2022 09:05 PM (IST) Tags: Suresh Raina IPL 2023 IPL Auction 2023

సంబంధిత కథనాలు

WPL Auction 2023: ఏంటీ పోటీ! WPL వేలంలో 90 మందికి 1000 పేర్లు నమోదు!

WPL Auction 2023: ఏంటీ పోటీ! WPL వేలంలో 90 మందికి 1000 పేర్లు నమోదు!

Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్!

Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్!

Womens IPL Bidders: రూ.1289 కోట్లతో WIPL ఫ్రాంచైజీ కొన్న అదానీ - 5 జట్ల విక్రయంతో బీసీసీఐ రూ.4669 కోట్ల సంపద!

Womens IPL Bidders: రూ.1289 కోట్లతో WIPL ఫ్రాంచైజీ కొన్న అదానీ - 5 జట్ల విక్రయంతో బీసీసీఐ రూ.4669 కోట్ల సంపద!

Ravindra Jadeja Tweet: ఆ రెండు పదాలతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ను థ్రిల్‌ చేసిన జడ్డూ!

Ravindra Jadeja Tweet: ఆ రెండు పదాలతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ను థ్రిల్‌ చేసిన జడ్డూ!

Rishabh Pant: పంత్‌కు ప్రత్యామ్నాయం - వేట ఇంకా కొనసాగుతుంది - పాంటింగ్ ఏమన్నాడంటే?

Rishabh Pant: పంత్‌కు ప్రత్యామ్నాయం - వేట ఇంకా కొనసాగుతుంది - పాంటింగ్ ఏమన్నాడంటే?

టాప్ స్టోరీస్

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!