Aiden Markram: కెప్టెన్ దిగిండు - సన్‌రైజర్స్ శిబిరంలో కొత్త జోష్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ జట్టుతో చేరాడు.
Aiden Markram, IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఎయిడెన్ మార్క్రమ్ జట్టు సభ్యులతో డిస్కస్ చేస్తున్న ఫొటోలను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రారంభ మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్ కారణంగా చాలా మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వారి సంబంధిత ఐపీఎల్ జట్లకు చేరుకోలేకపోయారు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ఏప్రిల్ 2వ తేదీన ముగిసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2023 కోసం భారతదేశానికి కూడా ఇప్పటికే చేరుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు ఈ లిస్ట్‌లో ఉన్నారు.
Captain Markram, reporting to duty 🫡@AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/KvZbmDMSy8
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2023
Protea Fire Idhi 🔥🇿🇦@AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/0gdloXk8Kw
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2023
#Riser Abdul getting ready for Some'Maad hitting in the next matches. 🤌🤩@ABDULSAMAD___1 | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/PFePYKNof3
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2023
ఏ ఫ్రాంచైజీలకు మేలు జరగనుంది?
ఐపీఎల్ జట్లు గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌లకు ఊరట లభించింది. ఆయా జట్లలో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. తదుపరి మ్యాచ్‌ల కోసం జట్టుకు అందుబాటులో ఉంటారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ - దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చేరుకోవడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చాలా ఉపశమనం లభించింది. భారత్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఉన్నాడు. ఎయిడెన్ మార్క్రమ్ గైర్హాజరీలో భువనేశ్వర్ కుమార్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్‌లు కూడా హైదరాబాద్‌కు ఆడనున్నారు.
గుజరాత్ టైటాన్స్ - దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ భారత్‌కు చేరుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గతేడాది జరిగిన ఐపీఎల్‌లో జట్టు కోసం చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను జట్టు కోసం 17 మ్యాచ్‌లలో ఫినిషర్ పాత్రను కూడా పోషించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏకంగా 481 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ - ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ ఐపీఎల్ 2023 కోసం పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. కగిసో రబడ జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్ పాత్రను పోషిస్తాడు.
లక్నో సూపర్ జెయింట్స్ - దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ఐపీఎల్ 2023 కోసం లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరాడు. ఐపీఎల్ 2022లో డి కాక్ అద్భుతమైన రిథమ్‌తో కనిపించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ - ఫాస్ట్ బౌలర్ సిసంద మగల కూడా IPL 2023 కోసం అతని జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. గాయపడిన కైల్ జేమీసన్ స్థానంలో చెన్నై మగలాను జట్టులో భాగంగా చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ - సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్లు లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే IPL 2023 కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరారు.