అన్వేషించండి
Advertisement
IPL 2024: 100 శతకాల చరిత్ర, ఐపీఎల్ 17వ సీజన్ అరుదైన రికార్డు
Shubman Gill: ఐపీఎల్ 17వ సీజన్ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్ లో గత అన్ని ఎడిషన్ ల కంటే ఎక్కువగా మొత్తం 14 శతకాలు నమోదయ్యాయి. మరే సీజన్‌లోనూ ఇన్ని సెంచరీలు నమోదుకాలేదు.
Shubman Gill records IPL's 100th century: ఐపీఎల్ (IPL) 17వ సీజన్ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 14 శతకాలు నమోదుకావటంతో పాటూ శుభమన్ గిల్ (Shubman Gill)చేసిన శతకం ఐపీఎల్‌లో 100వ సెంచరీ. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు బాదడంతో ఈ సీజన్లో శతకాల సంఖ్య 14కు చేరింది.
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజన్
ఐపీఎల్ 17వ సీజన్ లో ఇప్పటివరకు పలువురు బ్యాటర్లు శతకగర్జన చేశారు. ఇక ఈసారి నమోదైన మొత్తం 14 శతకాలను ఒకశారు చూసినట్లు అయితే వీటిలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జాస్ బట్లర్ 2 సెంచరీలు చేయగా, కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ , లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ , బెంగళూరు ఆటగాళ్ళు విల్ జాక్స్, విరాట్ కోహ్లీ తలో సెంచరీ చేశారు. ముంబై ప్లేయర్ రోహిత్ శర్మ , సూర్యకుమార్ యాదవ్, తలో శతకం సాధించగా, ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ , పంజాబ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో , చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్ తలో సెంచరీ చేశారు. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చెరో సెంచరీ చేయడంతో ఈ సీజన్లో శతకాల సంఖ్య 14 కి చేరింది. అదే గత సీజన్ లో అయితే మొత్తం 12 శతకాలు నమోదయ్యాయి.
బ్యాటర్ల విశ్వరూపం..
అసలు హాటు హాటుగా సాగిపోతున్న ఐపీఎల్ -17వ సీజన్లో బ్యాటర్లు విశ్వరూపం చూపిస్తున్నారు. ఒకప్పుడు టీ-20 ఫార్మాట్లో 200 స్కోరు అంటే అబ్బో అనిపించేది. సెంచరీ కొట్టడమే అద్భుతం అనిపించేది. అందుకే ఐపీఎల్ 2016 సీజన్‌లో 7 సెంచరీలు నమోదు కాగా, 2022 ఐపీఎల్‌లో 8 సెంచరీలు , 2023 ఐపీఎల్ సీజన్‌లో 12 సెంచరీలు నమోదుఅయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా 14 శతకాలతో రికార్డులకి ఎక్కింది. ఐపీఎల్ 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. ఆ సీజన్‌లో 81.08 సగటులో ఏకంగా 973 పరుగులు నమోదు చేశాడు. 2022 సీజన్‌లో 8 శతకాలు నమోదు కాగా, జాస్ బట్లర్ ఒక్కడే నాలుగు శతకాలు చేశాడు. పనిలోపనిగా నాలుగు అర్ధసెంచరీలు కూడా చేశాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచుల్లో బట్లర్ 57.53 సగటుతో ఏకంగా 863 పరుగులు చేశాడు.
2023 ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 12 శతకాలు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి16 వ సీజన్ లో ఎ 10కి పైగా సెంచరీలు రికార్డు అయ్యాయి. గత ఎడిషన్ లో తొమ్మిది మంది బ్యాటర్లు సెంచరీలు బాదారు. అప్పుడు ఆరెంజ్ క్యాప్ గెలిచిన గిల్ ఏకంగా మూడు శతకాలు నమోదు చేశాడు. ఆ గిల్ చేసిన శతకంతోనే మొత్తం ఇప్పటివరకు జరిగిన అన్నీ ఐపీఎల్ సీజన్ లలో కలిపి 100వ సెంచరీ నమోదు అయ్యింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion