అన్వేషించండి

IPL 2024:బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి, రాజస్థాన్ పై ప్రతీకారమా, పరాభవమా?

RR vs MI: ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌తో ముంబయి తలపడనుంది. టాస్‌ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.

Mumbai Indians opt to bat:  ఐపీఎల్‌(IPL)లో జైపుర్‌ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌(RR)పై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై ఇండియన్స్‌(MI) సిద్ధమైంది. టాస్‌ గెలిచిన ముంబయి  బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు తలపడిన తొలి మ్యాచ్‌లో ముంబైను వారి సొంతగడ్డపైనే రాజస్థాన్ రాయల్స్‌.... మట్టికరిపించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబయి ప్రణాళికలు రచిస్తోంది. 

ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ దూసుకెళుతోంది. మరోవైపు సీజన్ ఆరంభంలో తడిబడిన ముంబై మెల్లగా పుంజుకుంటోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో తృటిలో ఓటమిని తప్పించుకున్న ముంబై.. తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది.

ముంబై బ్యాటింగ్‌ ఓకే గానీ .. 

బ్యాటింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అదిరే ఫామ్‌లో ఉండగా... మరో ఓపెనర్‌ ఇషాన్ కిషన్‌ ధాటి ఆడుతున్నప్పటికీ ఎక్కువసేపు క్రీజులో ఉండడం లేదు. దక్కిన శుభారంభాలను కిషన్‌  పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చాల్సిన అవసరం ఉంది. తిలక్‌ వర్మ  పర్వాలేదనిపిస్తున్నాడు. బ్యాటర్‌గా పాండ్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌లోకి రావడం ముంబైకు అతిపెద్ద సానుకూలంశం. గాయం నుంచి కోలుకోని వచ్చిన సూర్య.... ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించాడు.   

టాప్‌లోనే ఉండాలని.....
రాజస్థాన్‌ రాయల్స్ ఈ సీజన్‌లో అదిరే ఆటతో అదరగొడుతోంది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటూ బౌలింగ్‌లో రాణిస్తూ... దూసుకుపోతోంది. ట్రెంట్‌ బౌల్ట్‌ ఆరంభంలో బ్యాటర్లను హడలెత్తిస్తుండగా... డెత్‌ ఓవర్లలో అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌ సేన్‌ కట్టడి చేస్తున్నారు. స్పిన్నర్ చాహల్‌ రాణిస్తుండగా.... సీనియర్‌ స్పిన్నర్‌ ఆశ్విన్‌ విఫలమవుతుండడం రాజస్థాన్‌కు ప్రతికూలంశం. బ్యాటింగ్‌లో అద్భుత ఫామ్‌లో రియాన్ పరాగ్‌ నిలకడగా రాణిస్తున్నాడు. జోస్‌ బట్లర్‌ ఫామ్‌లోకి రావడం రాజస్థాన్ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసింది. ఈ సీజన్‌లో బట్లర్‌ ఇప్పటికే రెండు శతకాలు బాదాడు. కెప్టెన్‌ సంజు కూడా రాణిస్తుండడం జట్టు దూసుకుపోతుంది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌.... వరుసగా విఫలమవుతుండడం రాజస్థాన్‌ను కలవరపెట్టే అంశం.   

ముంబై-రాజస్థాన్‌ హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మొత్తం 29 సార్లు తలపడ్డాయి. ఈ 29 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్  15 సార్లు గెలిచింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 13 విజయాలు సాధించింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. 

పిచ్‌ రిపోర్ట్‌
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. పిచ్‌ బౌలింగ్‌ అనుకూలిస్తూ ఉంటుంది. 200 కంటే ఎక్కువ స్కోరు చేస్తే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. IPL 2024 సీజన్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లో అత్యల్ప మొదటి ఇన్నింగ్స్ టోటల్ 183. అయినా ఇతర పిచ్‌లతో పోలిస్తే తక్కువ స్కోరు నమోదవుతుంది. 

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్.


రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget