అన్వేషించండి

IPL 2024: రాజస్థాన్‌ కు రెండవ విజయం - డీలా పడిన ఢిల్లీ

RR vs DC : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ వరుసగా రెండో విజయం సాధించింది. డిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

RR vs DC  IPL 2024 Rajasthan Royals wins by 12 runs:  ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ (RR)వరుసగా రెండో విజయం సాధించింది. డిల్లీ(DC)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్  జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. జైపూర్ వేదిక‌గా మ్యాచ్  ఈ సీజన్ లో మరో  ఉత్కంఠ పోరుగా నిలిచింది.  ఆఖ‌రి ఓవ‌ర్ వరకు అభిమానులను కట్టి పడేసింది. ఈసారి కూడా విజేత సొంత మైదానంలో ఆడిన జ‌ట్టే. 186 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢీల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ , స్టబ్స్‌ చెలరేగి ఆడినప్పటికీ మిగతా వారు ఘోరంగా  విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో బర్గర్‌, చాహల్‌ తలో రెండు వికెట్లు తీశారు.

ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంలో  ఆరంభంలో రాజస్థాన్‌ స్కోరు బోర్డు అసలు ముందుకే కదలలేదు. కానీ పది ఓవర్ల తర్వాత కాస్త పుంజుకున్న రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ 84 పరుగులతో రాణించడంతో 185 పరుగులు చేసింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ 29 పరుగులతో రాణించాడు. పరాగ్‌ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. 

పరాగ్‌ ఒక్కడే...
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ..రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే రాజస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. జట్టు స్కోరు తొమ్మిది పరుగుల వద్ద స్టార్ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ అవుటయ్యాడు. ఏడు బంతుల్లో అయిదు పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌ను.... ముకేష్‌ కుమార్‌ అద్భుత బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ కెప్టెన్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. కానీ ఖలీల్‌ అహ్మద్‌ సంజు శాంసన్‌ను అవుట్‌ చేసి రాజస్థాన్‌కు మరో షాక్‌ ఇచ్చాడు. 14 బంతుల్లో 15 పరుగులు చేసిన శాంసన్‌... పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే జోస్‌ బట్లర్‌ కూడా 16 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రాజస్థాన్ ఏడు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట దశలో రియాన్ పరాగ్‌.. రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజస్థాన్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ రాజస్థాన్‌ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్‌ మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. కానీ ఈ జోడీని అక్షర్‌ పటేల్‌ విడదీశాడు. 19 బంతుల్లో మూడు సిక్సర్లతో 29 పరుగులు చేసిన అశ్విన్‌.. అవుటయ్యాడు. ఆ తర్వాత రియాన్‌ పరాగ్‌ పోరాడడంతో రాజస్థాన్‌ పోరాడే లక్ష్యాన్ని.... ఢిల్లీ ముందు ఉంచింది. పరాగ్‌ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ధ్రువ్‌ జురెల్‌ 12 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌కుమార్‌ 1, ఖలీల్‌ అహ్మద్‌ 1, అక్షర్‌ పటేల్‌ 1, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తీశారు. 

రాజ‌స్థాన్ నిర్దేశించిన 186 ప‌రుగుల ఛేద‌న‌లో ఢిల్లీకి శుభారంభం ద‌క్కినా ఆ త‌ర్వాత త‌డ‌బ‌డింది.  30 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది.అక్క‌డి నుంచి కెప్టెన్ రిష‌భ్‌ పంత్‌, డేవిడ్ వార్న‌ర్‌ లు ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే అ 122 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు ప‌డిన ఢిల్లీ ఓట‌మి అంచున నిలిచింది. ఆసమయంలో    స్ట‌బ్స్(  సిక్స‌ర్ల మోత‌తో ఆశ‌లు రేపాడు. 19వ ఓవ‌ర్లో స్ట‌బ్స్ తొలి బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర్ బాదాడు. ఆఖ‌రి బంతికి అక్ష‌ర్ ప‌టేల్ రెండు ర‌న్స్ తీశాడు. దాంతో, ఆఖ‌రి ఓవ‌ర్లో 17 ర‌న్స్ అవ‌స‌ర‌మ‌య్యాయి.  కానీ అవేశ్ ఖాన్.. కేవ‌లం నాలుగు ర‌న్స్ ఇవ్వ‌డంతో ఢిల్లీకి రెండో ఓట‌మి త‌ప్ప‌లేదు.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget