అన్వేషించండి

IPL 2024 RCB: నయా డ్రస్ లో మెరిసిన ఆర్‌సీబీ ఆట‌గాళ్లు

Royal Challengers Bengaluru: ప‌ర్యావ‌ర‌ణ హితం కోరుతూ ఇలా బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు  ఏదో ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలో క‌నిపిస్తారు. ఈ నేపధ్యంలో ఐపీఎల్‌-17కు సంబంధించిన గ్రీన్ జెర్సీని రివీల్ చేశారు.

Why do RCB wear green jerseys during IPL: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2024) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రిగే ఐపీఎల్‌-2024 ప్రారంభ మ్యాచ్‌లో బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆర్‌సీబీ(RCB) ప్లేయ‌ర్లు చెన్నై చేరుకున్నారు.  ప్రమోషన్స్ లో  భాగంగా బుధ‌వారం ఉద‌యం బెంగ‌ళూరు ఆట‌గాళ్లు  గ్రీన్ జెర్సీని ధ‌రించారు. ఆర్‌సీబీ 2011 నుంచి ప్ర‌తి ఐపీఎల్ సీజ‌న్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతోంది. 
 
ప‌ర్యావ‌ర‌ణ హితం కోరుతూ ఇలా బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు  ఏదో ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలో క‌నిపిస్తారు. ఈ నేపధ్యంలో ఐపీఎల్‌-17కు సంబంధించిన గ్రీన్ జెర్సీని జ‌ట్టు స‌భ్యులు  రివీల్ చేశారు. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌, విరాట్ కోహ్లీ, మ‌హ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ర‌జ‌త్ పాటీదార్‌, మ‌హిపాల్ లోమ్రోర్లు  గ్రీన్ జెర్సీలో మెరిశారు. అంతకు ముందు  జరిగిన అన్​బాక్సింగ్ ఈవెంట్​లో ఈ టీమ్ కొత్త జెర్సీతో పాటు పేరును రివీల్​ చేసింది. తన పేరులో చిన్న మార్పు చేసింది. ఇప్పటి వరకు 'Royal Challengers Bangalore' కాస్త 'Royal Challengers Bengaluru' గా రూపాంతరం చెందినట్లు వెల్లడించింది. "మేం ఇష్టపడే నగరం, గర్వంగా అందిపుచ్చుకునే వారసత్వం ఇది మా సరికొత్త అధ్యాయం. మీ జట్టు, మీ ఆర్సీబీ" అంటూ ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అలాగే ఈ ఈవెంట్  ఫ్రాంచైజీ కొత్త కిట్‌ను కూడా విడుదల చేసింది, ఇది 2016 నుండి వారు ధరిస్తున్న నలుపు మరియు ఎరుపు నుండి కొద్దిగా మార్పు చేయబడింది. కొత్త కిట్‌లో సాంప్రదాయ నలుపు రంగుకు బదులుగా నేవీ బ్లూ కలర్‌ను ఉపయోగించారు.
 
మార్చి 22న ఐపీఎల్‌ మహా సమరం ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే తొలి దశ మ్యాచ్‌ల కోసం క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  
 
చెపాక్‌లో చెత్త రికార్డును, బెంగళూరు అధిగమిస్తుందా ?
చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌... రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. చెపాక్‌ స్టేడియంలో కోహ్లీ టీంకు చాలా చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది. 2008లో మాత్రమే బెంగళూరు.. చెన్నైని ఓడించింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లోనూ చెన్నైపై ఆర్సీబీ గెలవలేదు. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్‌ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. అయితే ఈసారి చెన్నైకు బెంగళూరు చెక్‌ పెడుతుందని అభిమానులు గంపెడాశలతో ఉన్నారు. మహిళల జట్టు ఇప్పటికే WPL టైటిల్‌ గెలచుకుందని... ఇక ఆర్సీబీ కూడా తమ ఆశలను నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget