IPL 2024: రోహిత్ శర్మ ఎందుకిలా మారిపోయాడు? నెక్ట్స్ T20 వరల్డ్ కప్ !
Rohit Sharma: ఈ ఐపీఎల్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సెంచరీ తర్వాత ఆ స్థాయి ఆట ఎక్కడా కనబరచలేదు. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో బీసీసీఐలో టెన్షన్ మొదలైంది.
Rohit Sharmas IPL performance: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma). రానున్న టీ 20 ప్రపంచకప్పు(T20 Wrld cup) కెప్టెన్ ఇప్పుడు ఫామ్ కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు. ముంబై(MI) మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్(IPL) లో ఆడిన ఆఖరి ఆరు మ్యాచుల్లో చేసిన పరుగులే ఇందుకు నిదర్శనం.గత ఆరు మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచ్ లోనూ ఇరవై పరుగులు కూడా దాట లేదు హిట్ మ్యాన్ . ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓ సెంచరీ బాదిన రోహిత్...మరే మ్యాచులోనూ కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. 13మ్యాచుల్లో 145 స్ట్రైక్ రేట్ తో 349పరుగులు చేసినా అదంతా రెండు మూడు మ్యాచుల్లోనే కొట్టేసిన స్కోరు. ముఖ్యంగా ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం ఈ సీజన్ తో రోహిత్ తో ప్రవర్తించిన విధానం అతని ఆట లయను కూడా దెబ్బతీసిందని అనుకోవచ్చు. రోహిత్ ను ఉన్నపళంగా తప్పించి హార్దిక్ ను తీసుకువచ్చిన విషయాన్ని రోహిత్ ఇంకా మర్చిపోలేదని రెండు రోజుల క్రితం జరిగిన ఘటన కూడా గుర్తు చేస్తోంది.
హాట్ టాపిక్ గా రోహిత్ కామెంట్స్
కోల్ కతాతో మ్యాచు కు ముందు KKR అకాడమీ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ తో మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. ముంబై క్రికెట్ యాజమాన్యాన్ని ఉద్దేశించి మాట్లాడిన రోహిత్.. ఏది పడితే అది చేస్తున్నారని... తను ఇన్వాల్వ్ కావాలనుకోవట్లేదని అలా అని వదిలేసి ఉండలేకపోతున్నానని అన్నాడు. ముంబై టీమ్ అంటే ఓ గుడి లాంటిదని దాన్ని నిర్మించటానికి తనెంత కష్టపడ్డానో తనకే తెలుసన్నాడు రోహిత్ శర్మ. ఏదైమైనా తనకిదే లాస్ట్ సీజన్ కాబట్టి ఇక పట్టించుకోనని అన్నాడు. ఈ వైరల్ వీడియోను KKR సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డిలీట్ చేసేసినా అప్పటికే ఇది వైరల్ అయిపోయింది. ఈ వీడియోనే ప్రజెంట్ రోహిత్ శర్మ మానసిక పరిస్థితి ఏంటో తెలియచేస్తోంది. ముంబైలో తనకు జరిగిన అవమానాన్ని అతను మర్చిపోలేక పోతున్నాడు.ఆ ప్రభావం ఆట మీద కూడా పడుతోంది.
మరోవైపు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూప్‌లుగా విడిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ విషయాలన్ని జట్టుపై తీవ్ర ప్రతికూలతను చూపించాయి. మొత్తానికి ఈ సీజన్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టుగా ముంబై నిలిచింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక ఎలిమినేట్ అయ్యింది.
రోహిత్ ఫామ్‌తో టీమిండియా ఆందోళన
మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఉంది. కెప్టెన్ గా ఓపెనర్ గా టీమ్ ను ముందుండి నడిపించాల్సిన రోహిత్ ఇలా లాస్ట్ ఆరు మ్యాచుల్లో ఇరవై పరుగులు కూడా చేయకపోవటం ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని పెద్దగా బాధ పెట్టిందో లేదో తెలియదుకానీ టీమిండియాకు మాత్రం కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం.హిట్ మ్యాన్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఉన్న మిగిలిన మ్యాచులో విరుచుకపడి వరల్డ్ కప్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు.