GT vs DC Match Highlights: విదేశీ ఆటగాడికి హిందీలో పంత్ సూచనలు.. తర్వాతి బాల్ కే వికెట్..! ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైంది..?
Rishabha Panth: సొంత మైదానంలోనే గుజరాత్ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది
IPL 2024: ఈ సీజన్ ఐపీఎల్ లో గత కొన్నిరోజులుగా హై స్కోరింగ్ థ్రిల్లర్స్ తో ఫ్యాన్స్ ను అలరించిన ఫ్రాంచైజీలు... చిన్న చేంజ్ కోసం... ఓ లో స్కోరింగ్, వన్ సైడెడ్ మ్యాచ్ ను అందించాయి. గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేస్తూ దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ను చీప్ గా 89 పరుగులకే ఆలౌట్ చేసి దిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత 8.5 ఓవర్లలోనే దాన్ని ఛేదించి నెట్ రన్ రేట్ ను బీభత్సంగా పెంచుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రిషబ్ పంత్ నిలిచాడు.
పంత్‌కు ఏదో తన హిట్టింగ్ కు అవార్డ్ వచ్చిందనుకోకండి. తన వికెట్ కీపింగ్, సరైన టైంలో సరైన బౌలింగ్ చేంజస్ చేసినందుకు వచ్చిన అవార్డ్. అందులో ఒక ఉదాహరణే.. మెయిన్ బౌలర్ అక్షర్ పటేల్ కన్నా ముందు.... పార్ట్ టైమర్ ట్రిస్టన్ స్టబ్స్ కు బౌలింగ్ ఇవ్వడం. అసలు చెప్పాలంటే.... స్టబ్స్ పార్ట్ టైమర్ కూడా కాదు. అతనో వికెట్ కీపర్ బ్యాటర్. నెట్స్ లో అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తుంటాడు.అలాంటి స్టబ్స్ కు పంత్ బౌలింగ్ ఇవ్వడం... ఒకే ఓవర్ లో అతను రెండు వికెట్లు తీయడం జరిగిపోయింది. కట్టుదిట్టమైన లైన్ లో స్టబ్స్ వేసిన రెండు బాల్స్.... బ్యాటర్లు ఆడలేకపోయారు. వికెట్ల వెనుక పంత్ చురుగ్గా స్టంపౌట్ చేసేశాడు. స్టబ్స్ ఖాతాలో రెండు వికెట్లు.
Rishabh Pant is more fit then Ever. pic.twitter.com/oWQoi12vPo
— Pantastic Pant 𝕏 (@iPantasticPant) April 18, 2024
అయితే ఈ రెండు వికెట్ల మధ్య ఓ సరదా సంఘటన జరిగింది. స్టంప్ మైక్ దగ్గర పంత్.... స్టబ్స్ కు ఏవో సూచనలు చేశాడు. కానీ అది హిందీలో. పట్టు విడవొద్దు.. పకడ్బందీగా వేస్తూ ఉండు అని హిందీలో స్టబ్స్ కు చెప్పాడు. తర్వాతి బాల్ కే వికెట్ పడింది. ఫారినర్ తో హిందీలో మాట్లాడటం... పంత్ కే చెల్లిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.
AI-generated Rishabh Pant spotted 🛫pic.twitter.com/R32k6uY8As
— Delhi Capitals (@DelhiCapitals) April 17, 2024
సొంత మైదానంలోనే గుజరాత్ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్‌కు దిగిన పంత్ సేన... ఎక్కడా గుజరాత్ బ్యాటర్లు కోలుకోనియ్యలేదు. కట్టిదిట్టమైన బౌలింగ్‌తో 89 పరుగులకే కుప్పకూల్చారు. మ్యాచ్ రెండో ఓవర్‌లో మొదలైన గిల్ సేన పతనం... పవర్ ప్లే ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులే చేసింది. మూకుమ్మడిగా బ్యాటర్లు విఫలం కావడంతో 17.3 ఓవర్లకే 89 పరుగులు చేసిన గుజరాత్ టీం అలౌట్ అయింది.
90 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ సేన చాలా ధాటిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వచ్చిన ప్రతి బ్యాటర్ బంతిని బాదుతూ కనిపించాడు మొత్తానికి నాలుగు వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే 90 పరుగుల టార్గెట్‌ను రీచ్ అయింది.