అన్వేషించండి

IPL 2024 Auction: 5 సిక్సులు కొట్టినోడికి రూ. 55 లక్షలు , 5 సిక్సులు ఇచ్చినోడికి రూ. 5 కోట్లు

IPL 2024 Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలం ముగిసింది. అయితే ఈ వేలంలో కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్(Pat Cummins) రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. ఇతర దేశాల ఆటగాళ్లకు ఈ స్థాయిలో ధర పలకడం పట్ల టీమిండియా ఫ్యాన్స్, టీమిండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

దయాళ్‌ వర్సెస్‌ రింకూ సింగ్‌

అయితే ఈ వేలంలో కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. 2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో కేకేఆర్‌ విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌ ఆఖరి ఓవర్‌లో చివరి ఐదు బంతులకు ఐదు భారీ సిక్సర్లు బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇది జరిగి ఏడు నెలల కాలం అయిపోయింది.  అయితే నిన్న జరిగిన ఐపీఎల్‌ వేలం తర్వాత ఈ టాపిక్‌ మళ్లీ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. విషయం ఏంటంటే  ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ విడిచపెట్టిన యశ్‌ దయాల్‌ను ఆర్సీబీ 5 కోట్ల ఊహించని ధరకు కొనుగోలు చేసింది. దీంతో దెబ్బకు దయాళ్ కోటీశ్వరుడైపోయాడు. ఇక సీన్ కట్ చేస్తే.. ఓ ఓవర్‌లో 5 సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌ రూ.5 కోట్ల ధర పలికితే.. 5 సిక్సర్లు కొట్టిన ఆటగాడు మాత్రం రూ.55 లక్షల జీతం మాత్రమే తీసుకుంటున్నాడు. దీంతో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదించుకున్న బౌలర్‌కు 5 కోట్ల భారీ మొత్తం దక్కనుండగా.. ఆ ఐదు సిక్సర్లు బాదిన బ్యాటర్‌కు మాత్రం కేవలం 50 లక్షలే లభించనున్నాయి. Image

కేకేఆర్‌పై విమర్శలు

సిక్సర్లు బాదించుకున్నవ్యక్తికే ఇంత భారీ మొత్తం లభిస్తున్నప్పుడు, ఆ సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్‌కు మాత్రం ఎందుకు అంత తక్కువ మొత్తమని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రింకూని కేవలం 50 లక్షలకే దక్కించుకుని, అతన్ని తిరిగి రీటెయిన్‌ చేసుకుని, అతన్ని ఆర్ధికంగా ఎదగకుండా కేకేఆర్‌ కట్టిపడేసిందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

Image

అసలేం జరిగిందంటే 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఓ మ్యాచులో తలపడ్డాయి. ఈ మ్యాచులో ఛేజింగ్‌లో చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాది.. కోల్‌కతాకు సంచలన విజయం అందించాడు రింకూ సింగ్. ఆ ఓవర్ వేసింది యశ్ దయాళ్. రింకూ దెబ్బకు యశ్ దయాళ్ అనారోగ్యం బారిన పడ్డాడు. మళ్లీ కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఆ ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ ఫేట్ మారిపోయింది. దెబ్బకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget