RCB Vs RR: 1450 రోజుల తర్వాత చిన్నస్వామిలో కెప్టెన్‌గా కోహ్లీ - కానీ టాస్ మాత్రం రాజస్తాన్‌దే!
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Royal Challengers Bangalore vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 24వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటింగ్‌కు దిగనుంది.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అబ్దుల్ బాసిత్, ఆకాష్ వశిష్ట్, డోనోవన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, కే ఎం ఆసిఫ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్
🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to field first against @RCBTweets.
— IndianPremierLeague (@IPL) April 23, 2023
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/H2rhfMIBeq
King Kohli returns to Namma Chinnaswamy as captain of RCB after 1️⃣4️⃣5️⃣0️⃣ days 🥹
— Royal Challengers Bangalore (@RCBTweets) April 23, 2023
Today just got ♾️ times special. We’re not crying, you are! 🥲#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #GoGreen #RCBvRR @imVkohli pic.twitter.com/MeOzf7Lgnz
ఐపీఎల్‌లో బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ జరిగే వేదికలను ప్రకటించింది. ప్లేఆఫ్స్‌లో భాగంగా క్వాలిఫయర్ - 1, ఎలిమినేటర్ చెన్నైలో జరుగనుండగా క్వాలిఫయర్ - 2, ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. 2022లో కూడా ఫైనల్ (గుజరాత్ - రాజస్తాన్) అహ్మదాబాద్‌లోనే ముగియడం గమనార్హం.
మార్చి 31న మొదలైన ఈ సీజన్ లో లీగ్ దశ మ్యాచ్‌లు మే 21 వరకు జరుగనున్నాయి. మే 21న ముంబై - హైదరాబాద్, బెంగళూరు - గుజరాత్ తో ముగిసే మ్యాచ్‌లతో లీగ్ దశకు తెరపడుతుంది. అప్పటికి ఐపీఎల్ - 16 పాయింట్ల పట్టికలో టాప్ - 4 టీమ్స్ ప్లేఆఫ్స్ ఆడతాయి.
ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్, వేదికలు..
- మే 23న తొలి క్వాలిఫయర్ జరుగనుంది. టేబుల్ టాపర్స్ 1, 2వ స్థానాల్లో ఉన్న జట్లు చెన్నైలో మ్యాచ్ ఆడతాయి.
- మే 24న చెన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. 3, 4 వ స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ ఆడతాయి.
- మే 26న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో క్వాలిఫయర్ -2 జరుగుతుంది. ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ -1లో ఓడిన జట్టు ఈ మ్యాచ్ లో తలపడతాయి.
- మే 28న క్వాలిఫయర్ - 1, 2 లలో విజేతగా నిలిచిన జట్లు అహ్మదాబాద్ లోనే ఫైనల్స్ ఆడతాయి. ఈ మ్యాచ్ తర్వాత లీగ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది.