RCB Vs LSG: ఆర్సీబీపై టాస్ గెలిచిన లక్నో - బౌలింగ్ వైపే మొగ్గు!
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Royal Challengers Bangalore vs Lucknow Super Giants: ఐపీఎల్ 2023 సీజీన్ 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి లక్ష్యాన్ని ఛేదించడం వైపు లక్నో మొగ్గు చూపింది అనుకోవచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగులో మ్యాచులు ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. మూడేళ్ల తర్వాత జట్లన్నీ హోమ్‌గ్రౌండ్‌లో అభిమానులను మురిపిస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే పిచ్‌లు ఇప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. వాటి స్వభావమేంటో అంత ఈజీగా అర్థమవ్వడం లేదు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ చిన్నస్వామి మైదానంలో తలపడుతున్నాయి. నేటి పిచ్ ఎలా ఉండబోతోంది? రెండు జట్లలో ఎవరిది ఆధిపత్యం?
చిన్నస్వామి.. అంటే అందరికీ గుర్తొచ్చేది హై స్కోరింగ్ పిచ్! కొన్నేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు, వందల కొద్దీ సిక్సర్లకు ఇది కంచుకోట! బౌలర్లకు సింహస్వప్నం. బ్యాటర్లకు స్వర్గధామం. సాధారణంగా బెంగళూరు స్టేడియం చాలా చిన్నది. బౌండరీ సరిహద్దులూ ఎక్కువ దూరం ఉండవు. అందుకే బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు బాదేస్తారు. సెంచరీలు కొట్టేస్తారు. 2018 నుంచి ఇక్కడ ఐపీఎల్ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 183. ఇదే సమయంలో ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఎఫెక్టివ్‌గా ఉంటున్నట్టు స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. పేసర్లు 9.8 ఎకానమీతో పరుగులు ఇస్తుండగా స్పిన్నర్లు 8.1తో కట్టడి చేస్తున్నారు. చివరి ఐదు సీజన్లలో సగటున మ్యాచుకు 18 సిక్సర్లు నమోదు అవుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ గతేడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇప్పటి వరకు రెండు సార్లు తలపడింది. రెండు సార్లూ ఓడింది. ఆర్సీబీ ఈ రెండు మ్యాచుల్లోనూ స్కోర్లను డిఫెండ్ చేసుకొంది. 2022, ఏప్రిల్ 19న డీవై పాటిల్‌లో జరిగిన మ్యాచులో ఆర్సీబీ మొదట 181/6 పరుగులు చేసింది. బదులుగా లక్నో 163/8కి పరిమితం అయింది. డుప్లెసిస్ 96 (64 బంతుల్లో) వీర బాదుడు బాదేశాడు. ఛేదనలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీసి రాహుల్ సేనను ఓడించాడు.
The two captains are all smiles ahead of the clash 😃
— IndianPremierLeague (@IPL) April 10, 2023
Are you ready Bengaluru? 😎
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/5BwqCizLCM
🚨 Team Updates 🚨
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A look at the Playing XIs of the two sides 🙌
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/fHFSHMEVHx