అన్వేషించండి

IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే

అహ్మాదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఐపీఎల్ 2026 ఫైనల్లో తలపడ్డాయి. ఐపీఎల్ ఫైనల్ లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.

LIVE

Key Events
RCB vs GT IPL 2026 Final Live Updates Royal Challengers Bengaluru vs Gujarat Titans Final Score Updates IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే
ఆర్సీబీ, గుజరాత్ ఫైనల్ లైవ్ అప్డేట్స్
Source : IPL

Background

దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. కెప్టెన్లుగా శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్ తమ జట్లను రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టాలని వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్‌సీబీ.. క్వాలిఫైయర్-1లో గుజరాత్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. మరోవైపు, క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్ (RR)ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ చేరింది. క్వాలిఫైయర్-1 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తుంటే, డిఫెండింగ్ ఛాంపియన్‌గా మరోసారి ఆధిపత్యం చెలాయించి వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని ముద్దాడాలని ఆర్‌సీబీ పట్టుదలతో ఉంది.

ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుండి ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరింది. కాగా, 2022లో లీగ్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కేవలం ఐదు సీజన్లలోనే మూడుసార్లు ఫైనల్‌కు చేరుకుని బలమైన శక్తిగా నిరూపించుకుంది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్‌లు జరగ్గా.. హోరాహోరీ పోరులో ఆర్‌సీబీ 5 విజయాలతో స్వల్ప ముందంజలో ఉండగా, గుజరాత్ 4 మ్యాచుల్లో గెలిచింది. గుజరాత్‌పై ఆర్‌సీబీ అత్యధిక స్కోరు 254 పరుగులు కాగా, దీనిని ఈ సీజన్ క్వాలిఫైయర్-1లోనే రజత్ పాటిదార్ సేన నమోదు చేసింది. అదే సమయంలో బెంగళూరుపై గుజరాత్ అత్యధిక స్కోరు 205 పరుగులు మాత్రమే. గత సీజన్ల రికార్డులను పరిశీలిస్తే 2022లో ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గాయి, 2023లో గుజరాత్ గెలవగా, 2024లో రెండు మ్యాచులను ఆర్‌సీబీ కైవసం చేసుకుంది. ఇక 2025లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

గుజరాత్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న 'క్వాలిఫైయర్-1' సెంటిమెంట్
ఐపీఎల్ 2026 ఎడిషన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు తలపడ్డాయి. ఏప్రిల్ 24న బెంగళూరులో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 81 పరుగులు) రాణించడంతో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ వృధా అయింది. ఆ తర్వాత ఏప్రిల్ 30న అహ్మదాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ 4 వికెట్ల తేడాతో ప్రతీకారం తీర్చుకుంది. ఇక మూడోసారి అత్యంత కీలకమైన క్వాలిఫైయర్-1లో తలపడగా.. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం గుజరాత్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసి 92 పరుగుల రికార్డు తేడాతో ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరింది.

ఈ మే 31న జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ వర్గాల్లో ఒక చారిత్రాత్మక సెంటిమెంట్ విపరీతంగా చర్చకు దారితీస్తోంది. ఐపీఎల్ చరిత్రలో గత కొన్నేళ్లుగా 'క్వాలిఫైయర్-1' మ్యాచ్‌లో గెలిచిన జట్టే లీగ్ విజేతగా (ట్రోఫీ విజేతగా) నిలుస్తూ వస్తోంది. ఈ అరుదైన మరియు బలమైన సెంటిమెంట్ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను, టెన్షన్‌ను రేకెత్తిస్తోంది. మరి ఆర్‌సీబీ ఈ చారిత్రాత్మక సెంటిమెంట్‌ను నిజం చేస్తూ వరుసగా రెండోసారి కప్పు కొడుతుందా, లేక శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ ఈ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలనుంది.

23:29 PM (IST)  •  31 May 2026

IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం

IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ మీద ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ విన్నింగ్ షాట్ 6 కొట్టి గెలిపించాడు. కింగ్ కోహ్లీ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో వరుసగా రెండో ఏడాది కప్ నెగ్గి మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. మరో 12 బంతులు మిగిలుండగానే 156 పరుగుల టార్గెట్ ఆర్సీబీ ఛేదించింది.

23:23 PM (IST)  •  31 May 2026

IPL 2026 Final Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 148/5

IPL 2026 Final Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 148/5.  కోహ్లీ 64, Jitesh sharma 9 పరుగులతో ఆడుతున్నారు. జీటీ స్కోర్ 155/8. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget