News
News
వీడియోలు ఆటలు
X

RCB Vs CSK: చిన్నస్వామిలో టాస్ బెంగళూరుదే - మొదట బ్యాటింగ్‌కు దిగనున్న ధోని సేన!

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

FOLLOW US: 
Share:

Royal Challengers Bangalore vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 24వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ (RCB) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటింగ్‌కు దిగనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, ఆకాష్‌దీప్, కరణ్ శర్మ, అనూజ్ రావత్

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్

చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆకాష్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్, సుభ్రాంషు సేనాపతి, షేక్ రషీద్, రాజ్‌వర్థన్ హంగర్గేకర్

ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ.. బయట థిక్కు ఫ్రెండ్స్‌! ఐపీఎల్‌లో మాత్రం కత్తులు నూరుకుంటారు! అందుకే ఆర్సీబీ, సీఎస్కే మ్యాచులకు అభిమానులు పోటెత్తుతుంటారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు చరిత్రలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై చెన్నై సూపర్‌ కింగ్స్‌దే కంప్లీట్‌ డామినేషన్‌. ఇప్పటి వరకు  ఈ రెండు జట్లు 30 సార్లు తలపడగా ఆర్సీబీ కేవలం 10 గెలిచింది. 19 ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. బెంగళూరు విజయాల శాతం 34.48 మాత్రమే.

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రీసెంట్‌ ఫామ్‌ అంత బాగాలేదు. చివరి ఐదు మ్యాచుల్లో ఏకంగా నాలుగు సార్లు ఓటమి చవిచూసింది. 2022లో మాత్రమే ఒక మ్యాచ్‌ గెలిచింది. అంతకు ముందు వరుసగా నాలుగింట్లో పరాజయం చవిచూసింది. 2020 అక్టోబర్లో 8 వికెట్లు, 2021 ఏప్రిల్‌లో 69 పరుగులు, 2021 సెప్టెంబర్‌ 6 వికెట్లు, 2022 ఏప్రిల్‌లో 23 పరుగుల తేడాతో ధోనీ సేన గెలిచింది. 2022 మేలో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది.

చిన్నస్వామి అంటే గుర్తొచ్చేది పరుగుల వరదే! పిచ్‌ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. బౌండరీలు చాలా చిన్నవి. డ్యూ ఉన్నప్పుడు ఫ్లడ్‌ లైట్ల కింద బంతి స్కిడ్‌ అవుతుంది. ఈ సీజన్లో అత్యధికం సిక్సర్లు నమోదైంది ఇక్కడే. కేవలం మూడు మ్యాచుల్లోనే 57 సిక్సర్లు బాదేశారు. చిన్నస్వామిలో ఇప్పటి వరకు 84 మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసినవి 34, ఛేదన చేసినవి 46 సార్లు గెలిచాయి. టాస్‌ గెలిచిన మ్యాచుల్లో 54.76 విజయాల శాతం ఉంది. మిస్టరీ స్పిన్నర్లు కాస్త ఇంపాక్ట్‌ చూపించే అవకాశం ఉంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ఈ సీజన్లో ఫ్యాన్స్‌ను మురిపిస్తోంది. 4 మ్యాచులాడి 2 గెలిచి 2 ఓడింది. మూడో విజయం అందుకోవాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్‌ ఫాప్ డుప్లెసిస్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. పవర్‌ ప్లేలో అపోజిషన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక కింగ్‌ కోహ్లీ ఆట అమేజింగ్‌! 4 మ్యాచుల్లోనే 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సిచ్యువేషన్‌కు తగ్గట్టు ఆడుతున్నాడు. అయితే ఆర్సీబీ బ్యాటింగ్‌లో టాప్‌ కంట్రీబ్యూటర్లు వీరే కావడం ఒక రకంగా గుడ్‌ సైన్‌. మరో రకంగా బ్యాడ్‌ సైన్‌. వీరిద్దరూ విఫలమైతే.. మిడిలార్డర్లో మాక్స్‌వెల్‌ (Maxwell) పైనే భారం పడుతోంది. అతడు గనక విఫలమైతే ఆడేవాళ్లే కనిపించడం లేదు. దినేశ్‌ కార్తీక్‌ తన మెరుపులు ప్రదర్శించలేదు. ఆర్సీబీ పవర్‌ ప్లే బౌలింగ్‌ బాగుంది. మహ్మద్‌ సిరాజ్‌ (Mohammad Siraj) కట్టుదిట్టమైన బంతులేస్తూ వికెట్లు తీస్తున్నాడు. కన్‌సిస్టెంట్‌గా ఒకే లెంగ్తులో బంతులేస్తున్నాడు. హర్షల్‌ పటేల్‌ ఇంకా మెరుగవ్వాలి. కరణ్ శర్మ స్పిన్‌ ఫర్వాలేదు. డెత్‌ ఓవర్లలో ఆర్సీబీ బలహీనంగా ఉంది.

Published at : 17 Apr 2023 07:14 PM (IST) Tags: RCB CSK IPL IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023 Royal Challengers Bangalore RCB Vs CSK IPL 2023 Match 24

సంబంధిత కథనాలు

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!

IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్