అన్వేషించండి

IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ జట్టుపై మాజీ దిగ్గజం జోస్యం.. RCB, MI జట్లు మాత్రం కాదు !

IPL 2026లో అన్ని జట్లు కనీసం 3 మ్యాచ్‌లు ఆడగా ఆయా జట్ల బలాలు, బలహీనతలు తెలిసిపోయాయి. వ్యూహాలు మార్చే టైం వచ్చింది. అయితే శ్రీలంక మాజీ క్రికెటర్ ఫైనల్ చేరే జట్టుపై జోస్యం చెప్పాడు.

చండీగఢ్: IPL 2026లో లీగ్ స్టేజీలో భాగంగా ఈరోజు డబుల్ హెడర్ ఉంది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings),  సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య జరగనుండగా, శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి. ఈ సీజన్లో 10 జట్లు కనీసం 3 మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ క్రమంలో జట్ల బలాబలాలతో పాటు బలహీనతలు బయటపడుతున్నాయి. 

లక్నో సూపర్ జెయింట్స్ LSGకి చెందిన ముకుల్ చౌదరి గత మ్యాచ్‌లో ఓడిపోయే పరిస్థితి నుంచి తప్పించి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించగా, RRకి చెందిన వైభవ్ సూర్యవంశీ మొదటి బంతి నుంచే అంతర్జాతీయ స్టార్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. గత మ్యాచ్‌ను మినహాయిస్తే, RCB బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణిస్తోంది. అత్యధికంగా టైటిల్స్ గెలిచిన జట్లు ముంబై ఇండియన్స్ MI, చెన్నై సూపర్ కింగ్స్ CSKలకు ఆరంభం అంతగా కలిసిరాలేదు. లీగ్ స్టేజీ సగం కూడా పూర్తికాకుండానే శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ జోస్యం చెప్పాడు. తన ప్రకారం ఏ జట్టు ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటుందో ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

రాజస్థాన్ రాయల్స్ IPL 2026లో ఇప్పటివరకూ ఆడిన 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. వీళ్లు కాకుండా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏ మ్యాచ్ ఓడిపోని ఏకైక జట్టు పంజాబ్ కింగ్స్. పంజాబ్ 3 మ్యాచ్‌లలో 2 గెలవగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

 రెండో IPL టైటిల్ కోసం రాజస్థాన్ నిరీక్షణ

IPL 2008లో ప్రారంభం కాగా, షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మొదటి సీజన్‌ ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే ఆ జట్టు ఫైనల్ వరకు చేరుకోగలిగింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ 2022లో ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో ఓడిపోయింది.

ఏంజెలో మాథ్యూస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఐపీఎల్ ఫైనలిస్ట్ జట్టుపై అంచనా వేశాడు. 'ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ ఖచ్చితంగా IPL 2026 ఫైనల్‌కు చేరుకుంటుంది' అని చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో ఎంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోందో ఈ పోస్ట్ తెలియజేస్తోంది. ఈ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీ దిగ్గజ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ముంబై ఇండియన్స్‌పై జట్టు 11 ఓవర్లలోనే 150 పరుగులు చేయగా, RCBపై 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. జట్టు విజయంలో ఓపెనర్లది కీలకపాత్ర. బౌలర్లు సైతం కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు.

బాగానే చెప్పావు. కానీ అంత త్వరగా డిసైడ్ అవ్వడం సరికాదని ఇతర జట్ల ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.  పిక్చర్ అబీ బాకీ హై అని కొందరు, సీజన్ సగం మ్యాచ్‌లు కూడా కాలేదని, ఇది టీ20 టోర్నమెంట్ ఏదైనా జరగొచ్చు అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget