అన్వేషించండి

Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 12 టీమ్ ను అనౌన్స్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అశ్విన్ ఐపీఎల్ 2026 ఉత్తమ ప్లేయింగ్ 11 ఎంచుకున్నాడు.
  • శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ, వైభవ్ ఓపెనర్ గా ఎంపిక.
  • విరాట్ కోహ్లీ, క్లాసెన్, పాటిదార్ మిడిల్ ఆర్డర్ లో ఆడుతారు.
  • ఓవర్సీస్ బౌలర్లు, భువనేశ్వర్, ఆర్చర్ తో బౌలింగ్ విభాగం.

Ravichandran Ashwin Picks Best Playing 11 Of IPL:  ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకునేలా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ సీజన్ కు సంబంధించిన బెస్ట్ ప్లేయింగ్ 12 టీమ్ ను సెలెక్ట్ చేశాడు. ఈ లిస్టులో ఎవరూ ఊహించని విధంగా గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను తన టీమ్ కు కెప్టెన్ గా అనౌన్స్ చేశాడు. ఈ సీజన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP) అవార్డు విన్నర్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని ఫస్ట్ ఓపెనర్ గా ఎంచుకున్నాడు. వైభవ్ ఈ టోర్నమెంట్ లో 16 మ్యాచుల్లో 237 కి పైగా స్ట్రైక్ రేట్ తో 776 రన్స్ చేసి హయ్యెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు.

Read Also: Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం  

గిల్ తో కలిసి ఓపెనింగ్.. 

అశ్విన్ టీమ్ లో సెకండ్ ఓపెనర్ గా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గిల్ ఈ సీజన్ లో 46 యావరేజ్, 163.02 స్ట్రైక్ రేట్ తో 732 రన్స్  స్కోర్ చేశాడు. ఇక ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) లెజెండ్ విరాట్ కోహ్లీని నంబర్ 3 పొజిషన్ కు పరిమితం చేశాడు. కోహ్లీ ఈ టోర్నీ అంతటా ఓపెనర్ గా ఆడినప్పటికీ అశ్విన్ మాత్రం అతడిని వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దించాడు. విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో 56.25 అద్భుతమైన యావరేజ్ తో 675 రన్స్ చేసి తన క్లాస్ పర్ఫార్మెన్స్ ను చూపించాడు.

Read Also: IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్

మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్, పాటిదార్.. 

నంబర్ 4 ప్లేస్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ను సెలెక్ట్ చేశాడు. క్లాసెన్ ఈ సీజన్ లో 48 యావరేజ్ తో 624 రన్స్ చేశాడు. నంబర్ 5 లో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ను ఎంచుకున్నాడు. పాటిదార్ 192.69 స్ట్రైక్ రేట్ తో 500 కి పైగా రన్స్ తో విధ్వంసం సృష్టించాడు. నంబర్ 6 ను ఎస్ఆర్‌హెచ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని కేటాయించాడు. నితీష్ 14 మ్యాచుల్లో 300 రన్స్ తో పాటు 8 వికెట్లు తీసి టీమ్ కు మంచి బ్యాలెన్స్ ఇచ్చాడు. నంబర్ 7 లో ఆర్‌సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాని ఎంపిక చేశాడు. కృనాల్ 16 మ్యాచుల్లో 226 రన్స్ తో పాటు 14 వికెట్లు పడగొట్టాడు.

ఓవర్సీస్ స్టార్లతో బౌలింగ్ లైన్ అప్..

బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కోసం అశ్విన్ ముగ్గురు ఫారెన్ ప్లేయర్లను లైన్ లోకి తెచ్చాడు. సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ (14 వికెట్లు), కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (15 వికెట్లు, 6.64 ఎకానమీ) లతో పాటు ఈ సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ కాగిసో రబాడ (29 వికెట్లు) ను మెయిన్ పేసర్ గా తీసుకున్నాడు. వీరితో పాటు ఆర్‌సీబీ స్పియర్ హెడ్ భువనేశ్వర్ కుమార్ ను ఎంచుకున్నాడు. భువి 16 మ్యాచుల్లో 7.95 ఎకానమీతో 28 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా రాజస్థాన్ రాయల్స్ (RR) స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు) ను ఎంపిక చేసినట్లు అశ్విన్ స్పష్టం చేశాడు.

Frequently Asked Questions

రవిచంద్రన్ అశ్విన్ తన IPL 2026 బెస్ట్ ప్లేయింగ్ 12 టీమ్ కు కెప్టెన్ గా ఎవరిని ఎంచుకున్నారు?

రవిచంద్రన్ అశ్విన్ తన IPL 2026 బెస్ట్ ప్లేయింగ్ 12 టీమ్ కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను కెప్టెన్ గా ఎంచుకున్నారు.

IPL 2026 సీజన్ లో MVP అవార్డు విన్నర్ ఎవరు, మరియు అశ్విన్ అతన్ని ఏ స్థానంలో ఎంచుకున్నారు?

IPL 2026 సీజన్ లో MVP అవార్డు విన్నర్ వైభవ్ సూర్యవంశీ. అశ్విన్ అతన్ని తన టీమ్ లో ఫస్ట్ ఓపెనర్ గా ఎంచుకున్నారు.

విరాట్ కోహ్లీని అశ్విన్ ఏ స్థానంలో బ్యాటింగ్ కు పంపారు?

విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో ఓపెనర్ గా ఆడినా, అశ్విన్ అతన్ని తన బెస్ట్ ప్లేయింగ్ 12 టీమ్ లో నంబర్ 3 (వన్ డౌన్) స్థానంలో బ్యాటింగ్ కు దించారు.

అశ్విన్ ఎంచుకున్న బౌలింగ్ లైన్‌లో ఎవరున్నారు?

అశ్విన్ బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్, సునీల్ నరైన్, కాగిసో రబాడ, భువనేశ్వర్ కుమార్ లను ఎంచుకున్నారు. జోఫ్రా ఆర్చర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget