IPL 2024: తొలి బ్యాటింగ్ పంజాబ్ దే, వర్షమా, పరుగుల వరదా?
PBKS vs SRH IPL 2024: వాతావరణం మేఘావృతమై ఉన్న వేళ పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
PBKS vs SRH IPL 2024 Punjab Kings opt to bat : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్(PBKS) బ్యాటింగ్ ఎంచుకుంది. వాతావరణం మేఘావృతమై ఉన్న వేళ పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నా పంజాబ్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సన్‌రైజర్స్ టాప్ 2కు వెళ్లే అవకాశం ఉండడంతో గెలుపు కోసం హైదరాబాద్ సర్వశక్తులు ఒడ్డనుంది. మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... పాయింట్ల పట్టికలో రెండో స్థానంపై కన్నేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్.. నామమాత్రపు మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. మరోవైపు పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండోస్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచి విజయంతో ఈ సీజన్‌ను ముగించాలని భావిస్తుంది. ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ప్లే ఆఫ్‌కు సిద్ధం కావాలని హైదరాబాద్ చూస్తోంది.
పిచ్ రిపోర్ట్:
హైదరాబాద్‌లో ఇప్పుడు వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండనుంది. బంతి బ్యాట్ మీదకు సులభంగా వస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో మీడియం పేసర్లకు ఈ పిచ్ సహకరించనుంది. అయితే సమయం గడిచేకొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్ మీదకు బంతి కొంచెం నెమ్మదిగా వస్తుంది. పిచ్ ఉపరితలం పొడిగా ఉంది. దీని కారణంగా బౌన్స్‌కు, స్పిన్‌కు సహకరించనుంది.
ఇప్పటిదాకా హైదరాబాద్‌దే ఆధిపత్యం
ఐపీఎల్‌లో పంజాబ్, హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడగా.. హైదరాబాద్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. మొహాలీలో ఇరు జట్లు ఆరు మ్యాచులు ఆడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచుల్లో గెలవగా... పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచుల్లో గెలిచింది. హైదరాబాద్‌లో ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచులు జరగగా... హైదరాబాద్ రికార్డు స్థాయిలో ఏడు సార్లు విజయం సాధించగా.... పంజాబ్ ఒకే మ్యాచ్ గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత అయిదు మ్యాచుల్లో హైదరాబాద్ నాలుగు మ్యాచులు గెలవగా.. పంజాబ్ ఒకే మ్యాచ్ గెలిచింది. పంజాబ్-హైదరాబాద్ మ్యాచులలో డేవిడ్ వార్నర్ 700 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 24 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 18 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ పోటీలో ముందుంది.