PBKS Vs RCB: పంజాబ్ vs బెంగుళూరు : టాస్ గెలిచిందెవరంటే
IPL 2024: ప్లే ఆప్ బెర్తు ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పంజాబ్, బెంగుళూరు టీమ్స్ పోరాడుతున్నాయి. అటు బ్యాటింగ్‌కి ఇటు బౌలింగ్‌కి రెంటికీ స్వర్గ ధామమైన ధర్మశాలలో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
IPL 2024: లీగ్ ఫేజ్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్న ఈ సమయంలో ప్లే ఆఫ్ రేసులో చాలా దూరాన నిలిచి పోయిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు కీలకమైన గేమ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శామ్ కరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ గేమ్ ఫలితంగా ఒకరికి నాకౌట్ తప్పదు. ఈ మ్యాచ్లో గెలిచే టీమ్ మరో రెండు విజయాలు సాధించి.. రేసులో ఉన్న చెన్నై వంటి టీమ్ మిగిలి ఉన్న రెండు మ్యాచ్లలోరూ ఓటమి పాలైతే తప్ప వీరికి ప్లేఆఫ్ అవకాశం రాదు.
రెండిటిదీ ఒకటే పరిస్థితి..
లేట్‌గా గేరు మార్చి మూడు వరుస విక్టరీలను ఎంజాయ్ చేస్తోన్న ఆర్ సీ బీ. . ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది. అలాగే గత మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచి ఒకటి ఓడిన పంజాబ్ సైతం తప్పక ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమైంది. ఈ రెండు టీమ్‌లూ చెరో ఎనిమిది పాయింట్లతో ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. కేవలం రన్ రేట్లో కొంత తేడా తప్ప దాదాపు రెండిటి పరిస్థితీ ఒక్కటే.
పిచ్ రిపోర్ట్
పిచ్ చాలా పొడిగా, హార్డ్‌గా ఉంది. నైట్ మ్యాచ్ కాబట్టీ... 190 ప్లస్ కొడితే.. గెలిచే అవకాశముందంటున్నారు. ధర్మశాల మంచి బ్యాటింగ్ పిచ్. అయితే ఈ పిచ్ పేస్‌కి, బౌన్సుకి సైతం అనుకూలిస్తుంది. సో బ్యాట్స్‌మెన్ బౌలర్ బౌన్స్‌కి బోల్తా పడితే వికెట్లు టపటపా రాలిపోయే అవకాశముంది. అలా కాకుండా బౌన్స్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటే రన్స్ ఫ్లోకి ఎలాంటి ఢోకా ఉండదు. బౌండరీ సైతం అటు దూరంగానూ కాక, దగ్గర గానూ కాక మధ్యస్తంగా ఉంటుంది. వికెట్‌ను బ్యాట్స్‌మన్ సరిగ్గా అర్థం చేసుకుంటే.. సిక్సర్ల మోతకు కొదువేమీ ఉండదు. మ్యాచ్ స్థితిగతులను పవర్ ప్లేనే నిర్ణయించబోతోంది.
టాస్ గెలిస్తే సాధారణంగా బౌలింగే
స్పిన్నర్స్‌కి సాధారణంగా ఏ మాత్రం అనుకూలించని ఈ పిచ్‌పై పేస్‌ని ధీటుగా ఎదుర్కొన నిలువగలిగే జట్లకు భారీ స్కోర్లు సాధించడం పెద్ద పనేం కాదు. నిజానికి దీన్ని హై స్కోరింగ్ పిచ్ గానే చెప్పుకుంటారు. కానీ గత కొన్ని మ్యాచ్‌ల గణాంకాలు చూస్తే పెద్ద పెద్ద స్కోర్లు ఇక్కడ రాలేదు. సాధారణంగా ఈ పిచ్‌పై టాస్ గెలిస్తే ఏ టీమయినా బౌలింగ్‌నే ఎంచుకుంటుంది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసి దాన్ని ఛేజ్ చేయడానికి ఇష్టపడుతుంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటి వరకూ ఇలా..
ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 12 మ్యాచుల్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీం ఏడు సార్లు గెలవగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ అయిదిట్లో గెలిచింది. టాప్ స్కోర్ 232-2 , లోయెస్ట్ టోటల్ 115 ఆలౌట్ రెండూ పంజాబ్ పేరిటే ఉన్నాయి. గతంలో ధర్మశాలలో జరిగిన మూడు మ్యాచ్ లలో టాస్ గెలిచిన కెప్టెన్లు బౌలింగ్‌నే ఎంచుకున్నారు. వీటిలో ఒక్కసారే బౌలింగ్ చేసిన టీం గెలిచింది. ఇదే పిచ్ పై గత మ్యాచ్‌లో చెన్నైతో తలపడ్డ పంజాబ్ తొలుత బౌలింగ్ చేసి 167 పరుగులకే చైన్నైని కట్టటడి చేసిన పంజాబ్.. ఆ తరువాత బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై 139 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 28 పరుగుల తేడాతో చెన్నై పంజాబ్ పై గెలిచింది.
పంజాబ్ టీమ్ ప్లేయింగ్ XI
శామ్ కరన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్ సిమ్రన్ సింగ్ (కీపర్), లియాన్ లివింగ్ స్టోన్, రిలీ రోస్సో, శశాంక్ సింగ్, అశుతోశ్ శర్మ, రాహుల్ ఛాహర్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, విద్వత్ కావేరప్ప,
బెంగుళూరు టీమ్ టీమ్ ప్లేయింగ్ XI
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కెమెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ (కీపర్), స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, లోకి ఫెర్గుసన్