PBKS Vs GT, IPL 2022 LIVE: పంజాబ్‌కు టెవాటియా స్ట్రోక్ - ఇది మామూలు థ్రిల్లర్ కాదు!
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE
Background
ఐపీఎల్ 2022 సీజన్‌లో 16వ మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్డేడియం (Brabourne) వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు తలో రెండు విజయాలు సాధించి మాంచి జోరు మీదున్నాయి.
గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మహ్మద్ షమి (Mohammed Shami), రషీద్ ఖాన్ (Rashid khan), లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson)లే గుజరాత్‌కు అత్యంత కీలకం. పంజాబ్ కింగ్స్ హిట్టర్లు, మంచి బౌలర్లతో సమతూకంగా ఉంది. లియామ్ లివింగ్ స్టోన్ (Liam Livingstone), షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, భానుక రాజపక్స మంచి హిట్టింగ్ చేస్తున్నారు. అర్షదీప్, రబాడా, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్లో పవర్‌ప్లేలో పంజాబ్ కింగ్స్‌దే అత్యధిక రన్‌రేట్. ఓవర్‌కి ఏకంగా 10.94 పరుగులను పంజాబ్ పవర్ ప్లేలో సాధించింది. గుజరాత్‌కు పవర్‌ప్లేలో అత్యుత్తమ బౌలింగ్ సగటు 10.71, ఎకానమీ 6.25 ఉన్నాయి. కాబట్టి పవర్‌ప్లే కూడా ఆసక్తికరంగానే ఉండనుంది.
కొత్త బంతితో చెలరేగుతున్న గుజరాత్ పేసర్ మహ్మద్ షమికి పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై రికార్డు బాగాలేదు. 11 ఇన్నింగ్సుల్లో 66 బంతులేసి 103 పరుగులు ఇచ్చాడు. ఒక్కసారీ ఔట్ చేయలేదు. ఈ సీజన్లో శుభ్‌మన్ గిల్ స్పిన్‌లో 21 బంతులు ఎదుర్కొన్నాడు. 214 స్ట్రైక్‌రేట్‌తో 45 పరుగులు చేశాడు. అయితే రాహుల్ చాహర్‌పై (Rahul Chahar) మాత్రం అతడికి మంచి రికార్డు లేదు. మూడు ఇన్నింగ్సుల్లో రెండు సార్లు ఔటయ్యాడు.
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ 33 సిక్సర్లు బాదింది. అగ్రస్థానంలోని రాజస్థాన్ రాయల్స్ (36) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 100 ఐపీఎల్ సిక్సర్లకు ఒక సిక్స్ దూరంలో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టన్, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), ఒడీన్ స్మిత్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, వరుణ్ ఆరోన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి
PBKS Vs GT Live Updates: 20 ఓవర్లలో గుజరాత్ స్కోరు 190-4, ఆరు వికెట్లతో టైటాన్స్ విజయం
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... టెవాటియా వరుసగా రెండు సిక్సర్లు బాదేసి గుజరాత్‌ను గెలిపించాడు. దీంతో గుజరాత్ ఆరు వికెట్లతో విజయం సాధించింది.
రాహుల్ టెవాటియా 13(3)
డేవిడ్ మిల్లర్ 6(4)
ఒడియన్ స్మిత్ 3-0-35-0
PBKS Vs GT Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 171-3, లక్ష్యం 190 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. సెంచరీ ముంగిట శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 171-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 27(18)
డేవిడ్ మిల్లర్ 1(1)
కగిసో రబడ 4-0-35-2
శుభ్‌మన్ గిల్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కగిసో రబడ (96: 59 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్)
PBKS Vs GT Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 158-2, లక్ష్యం 190 పరుగులు
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 158-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 95(57)
హార్దిక్ పాండ్యా 17(14)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-31-0
PBKS Vs GT Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 153-2, లక్ష్యం 190 పరుగులు
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 153-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 92(54)
హార్దిక్ పాండ్యా 15(11)
రాహుల్ చాహర్ 4-0-41-1
PBKS Vs GT Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 140-2, లక్ష్యం 190 పరుగులు
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 140-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 90(53)
హార్దిక్ పాండ్యా 6(6)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-26-0