IPL 2023లో రెండు జట్లను నడిపిస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తున్న పాండ్యా సోదరులు
ఐపీఎల్‌లో స్పెషల్ అట్రాక్షన్ పాండ్యా బ్రదర్స్గుజరాత్, లక్నో టీమ్స్ ను నడిపిస్తున్న సోదరులు
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. ఐపీఎల్ లో కొత్త జట్లైన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ను నడిపిస్తున్న కెప్టెన్లు. ఇలా రెండు ఐపీఎల్ టీమ్స్ కి బ్రదర్స్ కెప్టెన్ చేయటం ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి.
కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవటంతో లక్నోను ను నడిపించే బాధ్యతలను టీమ్ మేనేజ్మెంట్ కృనాల్ పాండ్యా కు అప్పగించింది. లాస్ట్ ఇయర్ కొత్త టీమ్ గా గుజరాత్ టైటాన్స్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యానే టీమ్ ను నడిపిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్ ట్రోఫీని గెలిచి షేన్ వార్న్ తర్వాత కెప్టెన్ అయిన ఏడాదే ట్రోఫీని గెలిచిన కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు నిన్న లక్నోతో గుజరాత్ మ్యాచ్ ఆడటంతో పాండ్యా బ్రదర్స్ ఇద్దరికీ ఫస్ట్ టైమ్ కెప్టెన్లుగా ఫేస్ ఆఫ్ పడింది.
Just two young boys from Baroda who never gave up on their dreams ✨❤️ @krunalpandya24 pic.twitter.com/VkescaxBcn
— hardik pandya (@hardikpandya7) May 7, 2023
పాండ్యా వర్సెస్ పాండ్యా మ్యాచ్ లో చిన్నోడు హార్దిక్ సారధ్యంలోని గుజరాత్ గెలిచింది. మ్యాచ్ టాస్ సందర్భంగా తన అన్న కృనాల్ తో దిగిన ఫోటోను హార్దిక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. బరోడాకు ఆడాలనే కలతో జర్నీ ప్రారంభించిన ఇద్దరు అన్నదమ్ములు..ఈ రోజు ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ టోర్నీ అయిన ఐపీఎల్ లో రెండు జట్లను నడిపిస్తున్నారు. ఈ జర్నీలో ఎప్పుడూ మేం గివప్ ఇవ్వలేదు పోరాడాం అంతే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
హార్దిక్ 2015 లో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ జర్నీ మొదలుపెడితే...కృనాల్ ను 2016 లో ముంబై ఇండియన్స్ తీసుకుంది. గతేడాది ఆక్షన్ లో ఇద్దరు అన్నదమ్ములు గుజరాత్, లక్నోకు వెళ్లేంత వరకూ నాలుగు ఐదేళ్ల పాటు ముంబైకి కలిసి ఆడారు. హార్దిక్ టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ అడుగుపెట్టి...ప్రస్తుతం కెప్టెన్ గా టీమిండియా టీ20జట్టును కూడా నడిపిస్తున్నాడు.
Started from the bottom and now we’re here 🤙 If we can do it, anybody can. Chase your dreams and never look back ✨ pic.twitter.com/0IcP32leEK
— Krunal Pandya (@krunalpandya24) April 23, 2023
బరోడాలో ఓ సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ అన్నదమ్ములు క్రికెటే శ్వాసగా ఇన్నాళ్ల పాటు కష్టపడి..ఇప్పుడు ఐపీఎల్ లాంటి ఖరీదైన టోర్నీలో తమ తమ టీమ్స్ ను కెప్టెన్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రతిభ ఉండి కష్టపడాలే కానీ అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చో నిరూపిస్తూ మంచి ఎంగ్జాపుల్ ను సెట్ చేశారు. ప్రస్తుతం సీజన్ లీగ్ స్టేజ్ ఆఖరి దశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్ గా ఉంటే...కృనాల్ కెప్టెన్సీలోని లక్నో మూడో స్థానంలో ఉంది. చూడాలి హార్దిక్ తన గుజరాత్ ను వరుసగా రెండోసారి విజేతగా నిలబెడతా...కృనాల్ లక్నోకు తొలి టైటిల్ ను అందిస్తాడా.