అన్వేషించండి

MI Creates IPL Superb Record: ఐపీఎల్ చరిత్రలో MI సరికొత్త రికార్డు: బుమ్రా సారథ్యంలో అరుదైన మైలురాయి!

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు భారతీయ కెప్టెన్లను కలిగిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బుమ్రా సారథ్యంలో పంజాబ్​పై ముంబై ఇండియన్స్​ విజయం సాధించింది.
  • ఒకే సీజన్​లో ముగ్గురు భారతీయ కెప్టెన్లతో ముంబై చరిత్ర సృష్టించింది.
  • 156 మ్యాచ్​ల తర్వాత బుమ్రాకు ఐపీఎల్​లో కెప్టెన్​గా అవకాశం దక్కింది.
  • నాయకత్వ మార్పులతో ముంబై క్యాంపెయిన్​ గందరగోళంగా కొనసాగుతోంది.

Mumbai Indians Create IPL History as Jasprit Bumrah Leads vs PBKS: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) ఒక విలక్షణమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాస్ వేయడానికి రావడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడు. దీనితో బుమ్రా తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఒకే సీజన్‌లో ముగ్గురు వేర్వేరు భారతీయ ఆటగాళ్లు (హార్దిక్, సూర్య, బుమ్రా) కెప్టెన్లుగా వ్యవహరించడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ ..

ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ముగ్గురు కెప్టెన్లను మార్చిన ఐదో జట్టుగా ముంబై నిలిచింది. గతంలో 2008లో ముంబై తరపున హర్భజన్ సింగ్, షాన్ పొల్లాక్, సచిన్ టెండూల్కర్ కెప్టెన్లుగా ఉండగా, ఆ తర్వాత పుణే వారియర్స్ ఇండియా (2013), సన్ రైజర్స్ హైదరాబాద్ (2021), పంజాబ్ కింగ్స్ (2024) ఈ జాబితాలో చేరాయి. అయితే పైన పేర్కొన్న జట్లన్నీ భారతీయులు ఇంకా విదేశీ ఆటగాళ్ల కలయికతో కెప్టెన్లను మార్చగా, ముంబై ఇండియన్స్ మాత్రం ఈసారి ముగ్గురు భారతీయులకే ఆ బాధ్యతలు అప్పగించి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వరుస గాయాలు, సీనియర్ల గైర్హాజరీ వల్ల ఈ పరిస్థితి తలెత్తినప్పటికీ, ఇది ముంబై టీమ్ లో ఉన్న లీడర్‌షిప్ డెప్త్‌ను తెలియజేస్తోంది.

బుమ్రా సుదీర్ఘ నిరీక్షణకు తెర‌..

జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ అరంగేట్రం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఏకంగా 156 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆయనకు కెప్టెన్ అయ్యే అవకాశం దక్కింది. లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రెండో ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. ఈ లిస్టులో రవీంద్ర జడేజా 200 మ్యాచ్‌లతో టాప్ లో ఉండగా, ఇప్పుడు బుమ్రా మనీష్ పాండే (153), అక్షర్ పటేల్ (148), కీరన్ పొలార్డ్ (137) వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. టాస్ సమయంలో బుమ్రా ఒక చమత్కారమైన కామెంట్ కూడా చేశాడు. ముంబైకి కెప్టెన్ కాకముందే టీమిండియా టెస్ట్ టీమ్ కు కెప్టెన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని నవ్వుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి.

గందరగోళంలో ముంబై క్యాంపెయిన్..

ఈ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ జట్టుకు అస్సలు కలిసి రావడం లేదు. వరుస ఓటములతో పాటు నాయకత్వ మార్పులు జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. టీమ్ లోని కోర్ గ్రూప్ అలాగే ఉన్నా, కెప్టెన్సీలో స్థిరత్వం లేకపోవడం వల్ల మైదానంలో ప్లానింగ్ కష్టంగా మారుతోంది. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా బుమ్రా కెప్టెన్‌గా రావడంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్ర‌ధాన కోచ్ మాహేల జయవర్ధనే పర్యవేక్షణలో ఉన్న ఈ టీమ్, కనీసం మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి తమ గౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. ప్లేఆఫ్స్ రేసులో నుంచి ఔట్ అయిన‌ప్ప‌టికీ, బుమ్రా లాంటి అగ్రెసివ్ బౌలర్ నాయకత్వంలో ముంబై కొత్త ఉత్సాహంతో ఆడుతుందనే అంచనాలు ఉన్నాయి.

Frequently Asked Questions

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఒకే సీజన్‌లో ముగ్గురు వేర్వేరు భారతీయ ఆటగాళ్లను కెప్టెన్లుగా మార్చడం ఒక ప్రత్యేక రికార్డు కాదా?

అవును, ఇది ఐపీఎల్ చరిత్రలో తొలిసారి. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో ముంబైకి కెప్టెన్లుగా వ్యవహరించారు.

జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఎప్పుడు అరంగేట్రం చేశాడు?

జస్ప్రీత్ బుమ్రా తన 156వ ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి కెప్టెన్‌గా అరంగేట్రం చేశాడు.

ఒకే సీజన్‌లో ముగ్గురు కెప్టెన్లను మార్చిన ఐదవ జట్టు ఏది?

ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ముగ్గురు కెప్టెన్లను మార్చిన ఐదవ జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రెండో ఆటగాడు ఎవరు?

లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రెండో ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget