అన్వేషించండి

MS Dhoni Captaincy: కెప్టెన్ సెలక్ట్ చేస్తే సీఎస్కేలా ఉంటుంది- సీఈవో సెలక్ట్ చేస్తే కేకేఆర్ లా ఉంటుంది!

మిగతా అందరు కెప్టెన్లతో పోలిస్తే ఎంఎస్ ధోనీ ఎందుకంత ప్రత్యేకమో మరోసారి తెలిసి వచ్చింది. కేకేఆర్ తో ఈ పోలిక చూస్తే మీకూ అర్థమైపోతుంది.

పురుషులందు పుణ్యపురుషులు వేరయా... కెప్టెన్లందు కెప్టెన్ కూల్ వేరయా... ఈ పద్యం పేరడీ చూసి ఇదేదో ధోనీ భజన స్టోరీ అనుకోకండి. లాజిక్స్ ప్రకారం మాట్లాడితే... ధోనీ లాంటి కెప్టెన్ ఇకముందు రాడు అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్ తోనూ అదే విషయాన్ని ధోనీ, సీఎస్కే మేనేజ్ మెంట్ ప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు.

తుషార్ దేశ్ పాండే.... ఫస్ట్ 2-3 మ్యాచెస్‌లో ఫెయిల్ అయ్యాడు. కానీ ధోనీ నమ్మకముంచాడు. ఇప్పుడు అదరగొడుతున్నాడు. ఆకాష్ సింగ్, మతీష పతిరాన... ఎవరికీ తెలియని యువ ఆటగాళ్లు. చూస్తున్నాం కదా ఎలా బౌలింగ్ చేస్తున్నారో. శివం దూబే.... ఆర్సీబీ తరఫున విఫలం. మరి సీఎస్కే తరఫున..? విధ్వంసం. అజింక్య రహానే... 'ఆ టెస్ట్ ప్లేయర్ లే... టీ20ల్లో ఒకప్పుడు ఆడేవాడు. ఇప్పుడు కష్టంలే' అన్నారంతా. కానీ సీఎస్కేలో... రహానే 2.0 ను మనం చూస్తున్నాం.

ఇవి కొన్ని ఉదాహరణలు. వీళ్లందరి పర్ఫార్మెన్స్ వెనుక సింపుల్ కారణాలు. మొదటిది.... జట్టులో చోటుపై వారికి కెప్టెన్ ఇచ్చిన భరోసా. ఒక్క ఫెయిల్యూర్ కే తీసి పక్కన పెట్టేసే రకం కాదు ధోనీ. అందుకే వీరంతా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయట్లేదు. రెండో కారణం... వీరందరికీ జట్టులో స్పెసిఫిక్ బాధ్యతలు అప్పజెప్పారు. వాటిని సరిగ్గా చేస్తే చాలు... ధోనీ అంతకన్నా ఇంకేం అడగడు. ఈ రకమైన ఆట టీ20లో ఏ జట్టుకైనా మంచి టెంప్లేట్ అవుతుంది.

ఇప్పుడు ధోనీ స్పెషాల్టీ ఏంటో తెలియాలంటే.... దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్న జట్టు గురించి చెప్పుకుందాం. కేకేఆర్. ఈ సీజన్ లో కేకేఆర్ ఇప్పటికి ఆడిన మ్యాచెస్... 7. ప్రయోగించిన ఓపెనింగ్ కాంబినేషన్స్ 5. ఇది చాలదా ఎంత ఇన్ కన్సిస్టెంటో చెప్పడానికి. నిజమే. సీజన్ కు ముందు శ్రేయస్ దూరమయ్యాడు. పెద్ద దెబ్బే. కానీ సీజన్ లో టీం సెలక్షన్ ఘోరం. వరుసగా 2 మ్యాచులు శార్దూల్ ఠాకూర్ ను కూర్చోపెట్టారు. గాయమో కాదో కూడా తెలియదు. అంతా సీక్రెసీ. ఎక్స్ ప్రెస్ పేస్ వేసే లాకీ ఫెర్గూసన్. కాస్త విఫలమయ్యాడు. నిజమే. కానీ అంతటి వరల్డ్ క్లాస్ బౌలర్ పై నమ్మకముంచి మరి కొన్ని మ్యాచెస్ అవకాశం ఇవ్వలేరా..? జట్టులో ముగ్గురు వికెట్ కీపర్ బ్యాటర్లు ఉన్నారు. నారాయణన్ జగదీశన్, రహ్మనుల్లా గుర్బాజ్, లిట్టన్ దాస్. తర్వాతి మ్యాచ్ లో ఇతనే మా వికెట్ కీపర్ అని చెప్పే పరిస్థితి కేకేఆర్ కు లేదు. ముగ్గురితో మ్యుజికల్ చైర్ ఆడుతోంది.

 పర్ఫార్మ్ చేయకపోగానే జట్టులో నుంచి తీసేయడం.. ఓ ప్లేయర్ కు సరిపడా భరోసా ఇవ్వకపోవడం... స్ట్రాటజీల్లో మార్పుల మీద మార్పులు. ఇదంతా ధోనీ స్టైల్ కు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది కదా. ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నమెంట్ లో ఓ ప్లాన్, స్ట్రాటజీ వేస్తే దానికి కట్టుబడి ఉండాలి. కనీసం వరుసగా కొన్ని మ్యాచెస్ కు అయినా సరే. అప్పుడే ఫలితాలు వచ్చేది.

కేకేఆర్ కు ఆ స్ట్రాటజీ, ప్లాన్సా ధ్యమవట్లేదు. అయినా లాస్ట్ సీజన్ లోనే శ్రేయస్ అయ్యర్... సంచలన వ్యాఖ్యలు చేశాడు కదా. టీం సెలెక్షన్ లో సీఈవో వెంకీ మైసూర్ కూడా ఇన్వాల్వ్ అవుతారని. మరి ఈసారి కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఉన్నారు. అందుకే సెలక్షన్ ఇంత అస్తవ్యస్తంగా ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget