అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2024: హైదరాబాద్ మరోసారి తడ"బ్యాటు", ముంబై ముందు ఓ మోస్తరు లక్ష్యం
IPL 2024, MI vs SRH: ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, చివర్లో పాట్ కమిన్స్ మాత్రమే దూకుడుగా ఆడారు.
MI vs SRH IPL 2024 Mumbai Indians target 174: వాంఖడే వేదికగా ముంబై(MI)తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ట్రానిస్ హెడ్ మినహా మిగిలిన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. హైదరాబాద్ బ్యాటర్లలో ఎనిమిది మంది కనీసం 20 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయారు. హెడ్, కమిన్స్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితమైంది. ముంబయి బౌలర్లలో పీయూష్ చావ్లా 3, హార్దిక్ పాండ్య 3, అన్షుల్ కంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.
ఆరంభంలో పర్వాలేదనిపించినా...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రానిస్ హెడ్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి మంచి పునాదే వేశారు. కానీ అభిషేక్ శర్మ అవుటైన తర్వాత హైదరాబాద్ వికెట్ల పతనం ప్రారంభమైంది. 16 బంతుల్లో 11 పరుగులు చేసిన అభిషేక్ శర్మను బుమ్రా అవుట్ చేసి హైదారాబాద్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే మయాంక్ అగర్వాల్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆరు బంతుల్లో అయిదు పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను కంబోజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 68 పరుగులకే హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది.
ట్రానిస్‌హెడ్‌తో జత కలిసిన నితీశ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ ట్రానిస్ హెడ్‌ను అవుట్ చేసిన అమిత్ మిశ్రా హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్‌లో 30 బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్‌తో ట్రానిస్ హెడ్ 48 పరుగులు చేసి అవుటయ్యాడు. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రానిస్ హెడ్‌దే అత్యధిక స్కోరు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరి తీవ్ర నిరాశకు గురి చేశాడు. నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసిన క్లాసెన్‌ను పియూష్ చావ్లా అవుట్ చేశాడు. మార్కో జాన్సన్ 12 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటవ్వగా... షెహబాజ్ అహ్మద్ 12 బంతుల్లో 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అబ్దుల్ సమద్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పాట్ కమిన్స్ 17 బంతుల్లో 35 పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలోఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, పీయూష్ చావ్లా 3 వికెట్లతో రాణించారు.
ముంబై పరువు నిలవాలంటే గెలవాల్సిందే..
పాయింట్ల పట్టికలో అట్టడుగున ముంబైకు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ముంబై చూస్తోంది. 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన ముంబై ప్లే ఆఫ్‌కు దాదాపుగా దూరమైంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
క్రికెట్
పాలిటిక్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement