అన్వేషించండి

IPL 2024: బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్‌, పరుగుల వరదను ముంబై ఆపగలదా ?

IPL 2024, MI vs SRH: ఐపీఎల్‌ 17 వ సీజన్‌లో ఆత్మ విశ్వాసంతో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బలహీనంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా తలపడనుంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.

MI vs SRH IPL 2024  Mumbai Indians opt to bowl: వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌,  ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే మ్యాచ్ లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్‌ గెలిచి హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు అప్పగించాడు.  ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని హైదరాబాద్‌ చూస్తుండగాnపరువు కోసం ముంబై పాకులాడుతోంది.  నిజానికి ముంబయికి ఈ మ్యాచ్‌ ఫలితంతో  వచ్చే ప్రయోజనం ఏం లేదు.  కానీ  ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిస్తే ఆత్మవిశ్వాసం లోపించిన ముంబైపై విజయం కష్టమేమీ కాదు.

వాంఖడే పిచ్‌ అంటే  బ్యాటర్లు తగ్గేదే లే.. 
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170. వాంఖడే పిచ్ పరిస్థితుల ప్రకారం టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ . కానీ ఈసారి టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ను హైదరాబాద్ కు అప్పగించింది. వాంఖడేలో ఫ్లడ్‌లైట్ల కింద కొత్త బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. ఛేజింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. పవర్ ప్లే‌లో దూకుడుగా ఆడితే భారీ స్కోర్లు నమోదవ్వడం ఖాయం.

ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్ కు ప్రతి మ్యాచ్ కీలకమే..
ఐపీఎల్‌లో ఈ సీజన్‌ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని ప్యాట్‌ కమిన్స్‌ సేన గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు జోరు మీద ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగులు సాధించారు. మరోసారి హైదరాబాద్‌ బ్యాటర్లు జోరు అందుకుంటే ముంబై ఇండియన్స్‌కు కష్టాలు తప్పవు. వాంఖడే స్టేడియంలో పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మరోసారి హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వాంఖడేలో బౌండరీలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 200కంటే ఎక్కువ పరుగులే చేస్తుంది.

పరువు నిలవాలంటే గెలవాల్సిందే.. 
పాయింట్ల పట్టికలో అట్టడుగున ముంబైకు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ముంబై చూస్తోంది. 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన ముంబై ప్లే ఆఫ్‌కు దాదాపుగా దూరమైంది. రాబోయే T20 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అవసరం. ఈ మ్యాచ్‌లో అయినా పాండ్యా రాణిస్తాడేమో చూడాలి.  కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్ కోల్‌కత్తాపై మంచి అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు.

ముంబయి ఇండియన్స్‌ తుది జట్టు: 

ఇషాన్‌ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ది్క్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్(అరంగేట్రం), పీయూష్‌ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు:

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్‌ అహ్మద్‌, మార్కో జాన్సన్‌, పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, నటరాజన్.

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget