By: ABP Desam | Updated at : 01 Apr 2023 07:33 PM (IST)
టాస్ వేస్తున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (Image Credits: LSG Twitter)
Lucknow Super Giants vs Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్ మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. రిషబ్ పంత్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. దీంతో డేవిడ్ వార్నర్‌కు ఢిల్లీ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీని అందించింది. రిషబ్ పంత్ స్థానంలో యువ ఆటగాడు అభిషేక్ పోరెల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
అరంగేట్రంతోనే అదరగొట్టిన జట్టు లక్నో సూపర్ జెయింట్స్! ఆటగాళ్ల ఎంపిక నుంచి స్టేడియంలో అడుగుపెట్టేంత వరకు ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తారు. ఇంటర్నేషనల్ లెవల్ ఆల్‌రౌండర్లు ఉండటంత ఎల్‌ఎస్‌జీ బలం. అన్నీ కుదిరితే జట్టులోని పదకొండు మందీ దుమ్మురేపగలరు. కొన్నాళ్లుగా ఇబ్బంది పడ్డ రాహుల్ ఈ మధ్యే ఫామ్‌లోకి వచ్చాడు. పైగా ఇష్టమైన ఐపీఎల్‌లో ఎలా పరుగులు చేస్తాడో తెలిసిందే. క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ దంచికొడుతున్నారు. మిడిల్ నుంచి లోయర్ ఆర్డర్లో దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్య, డేనియెల్ సామ్స్, మార్కస్ స్టాయినిస్ ఉన్నారు. అవేశ్ ఖాన్, మొహిసన్ ఖాన్, మార్క్‌వుడ్, జయదేశ్ ఉనద్కత్ పేస్ చూస్తారు. కృనాల్, బదోనీ, హుడా, రవి బిష్ణోయ్ స్పిన్ ఇరగదీస్తారు. సమతూకం కుదిరితే ఎదురులేని జట్టిది.
ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రామిసింగ్ టీమ్! సీజన్ మారే కొద్దీ బలంగా మారుతోంది. ఈసారి రిషభ్ పంత్ లేకపోవడం పెద్ద వీక్‌నెస్! అయితే డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ఆశలు రేపుతోంది. లీగ్ దశలో అదరగొడుతున్న ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ఒత్తిడికి చిత్తవుతోంది. దీన్నుంచి వేగంగా బయటపడాల్సి. మిచెల్ మార్ష్ మంచి ఫామ్‌లో ఉండటం, బిగ్‌మ్యాచ్ ప్లేయర్ కావడం ప్లస్ పాయింట్. పంత్ స్థానంలో తీసుకున్న అభిషేక్ పొరెల్ ఎలా రాణిస్తాడో చూడాలి. పృథ్వీ షా, వార్నర్ ఓపెనింగ్‌కు వస్తారు. మిచెల్ మార్ష్ వన్‌డౌన్‌లో వస్తాడు. మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్, మనీశ్ పాండే, ఫిల్‌సాల్ట్, రిలీ రొసొ, అక్షర్ పటేల్, కీలకం అవుతారు. ఖలీల్ అహ్మద్, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఎంగిడి, నోకియా, సకారియా, ఇషాంత్ వంటి బౌలింగ్ దళం వీరి సొంతం.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్‌దే పైచేయి! గతేడాది జరిగిన రెండు మ్యాచుల్లోనూ రెండుసార్లూ రాహుల్ సేనే గెలిచింది. ఈసారీ అలాంటి డామినేషన్‌తోనే సీజన్ మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది. తమ బలహీనతల నుంచి బయటపడాలని ఢిల్లీ కోరుకుంటోంది.
Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య
IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?